పరీక్షలు నిర్వహిస్తున్న డాక్టర్ బాలకృష్ణా రెడ్డి
ప్రజాశక్తి - ఆస్పరి
'జగనన్న ఆరోగ్య సురక్ష' ప్రజారోగ్యానికి రక్ష అన్ని సర్పంచి లక్ష్మి, వైస్ ఎంపిపి చంద్రకళ తెలిపారు. గురువారం మండలంలోని కారుమంచి గ్రామంలో 'జగనన్న ఆరోగ్య సురక్ష' నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. కుటుంబంలోని ప్రతిఒక్కరికీ ఆరోగ్య సేవలు అందించాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 'ఆరోగ్య సురక్ష'ను తీసుకొచ్చారన్నారు. డాక్టర్ రఘురామ్ రెడ్డి మాట్లాడుతూ... గ్రామంలో నిర్వహించిన 'జగనన్న సురక్ష'లో 464 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశామని తెలిపారు. స్పెషలిస్టులు గీతావాణి, మాధవి లత, డాక్టర్లు శశి కిరణ్, బాలకృష్ణా రెడ్డి, అంగన్వాడీ సూపర్‌వైజర్ పద్మావతి, వైసిపి నాయకులు కౌలుట్ల, రాజన్న గౌడ్ పాల్గొన్నారు.










