May 11,2023 22:24

అధికారులతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే

కదిరి అర్బన్‌ :స్థానిక ఆర్డీవో కార్యాలయం ఎదురుగా ఉన్న సర్వేనెంబర్‌ 1777 లో జగనన్న లేఅవుట్‌ను స్థానిక డాక్టర్‌ పివి సిద్దారెడ్డి స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి పేదవాడికి ఇల్లు అన్న నినాదంతో అర్హత కలిగిన లబ్ధిదారులకు ఇంటి పట్టాలను నిరంతరం అందజేస్తామని అన్నారు. అందులో భాగంగా కదిరి మున్సిపాలిటీ పరిధిలోని ఆర్డీవో కార్యాలయంలో ఎదురుగా సర్వేనెంబర్‌ 1777 లో పేదవారికి ఇంటి పట్టాలను అందజేసేందుకు ఏర్పాటు చేస్తున్న జగనన్న లేఅవుట్‌ను అధికారులతో కలిసి పరిశీలించినట్లు చెప్పారు. ఇది ఒక నిరంతర ప్రక్రియగా ప్రభుత్వం చేపట్టిందని, అర్హత కలిగిన ఏ ఒక్కరూ కూడా నష్టపోకుండా ప్రతి ఒక్కరికి ప్రభుత్వం ఇంటి పట్టాలను అందజేయడంతో పాటు గృహ నిర్మాణం చేపట్టేందుకు అన్ని విధాల సహాయ సహకారాలు అందజేస్తామన్నారు. మంచి లేఅవుట్‌లో లక్షలాది రూపాయల విలువచేసే స్థలాలను పేదలకు అందజేయడం ఎంతో గర్వంగా ఉందన్నారు. ఇంకా ఎవరైన అర్హులుంటే ఇంటి పట్టా కోసం దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌, వైస్‌ఛైర్మన్లు, కౌన్సిలర్లు, ఆయా శాఖల అధికారులు,వైసిపి నాయకులు పాల్గొన్నారు.