ప్రజాశక్తి-సిఎస్‌పురం: జగనన్న ఆరోగ్య సురక్ష పేదలకు వరమని ఎంపీడీవో రామచంద్రరావు అన్నారు. మండలంలోని ఎ కొత్తపల్లి సచివాలయం పరిధిలో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం బుధవారం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్‌రెడ్డి పేద ప్రజలను ఆదుకునేందుకు ఈ సురక్ష కార్యక్రమాన్ని తీసుకువచ్చారని అన్నారు. ఈ పథకం కింద గ్రామాల్లోనే వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి పేదలందరికీ చికిత్స చేయిస్తామని పేర్కొన్నారు. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు, ఆర్థికంగా స్తోమత లేని వారు ఈ జగనన్న ఆరోగ్య సురక్ష ద్వారా చికిత్స చేయించుకుని ఉచితంగా మందులు పొందవచ్చని తెలిపారు. అనంతరం సచివాలయం పరిధిలోని గ్రామాల ప్రజలు వైద్య చికిత్సలు చేయించుకొని మందులు తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ షేక్ నాగులమీరా, ఏ కొత్తపల్లి, అంబవరం సర్పంచులు ముప్పాళ్ల శ్యామలమ్మ, కొండూరు కొండయ్య, మండల వైసీపీ అధ్యక్షులు భువనగిరి వెంకటయ్య, మండల సచివాలయాల కన్వీనర్ బైరెడ్డి తిరుపతిరెడ్డి, సింగిల్ విండో అధ్యక్షులు పెరుగు సుబ్బరామయ్య, అంబవరం మాజీ సర్పంచ్ అద్దంకి రమణయ్య, కమ్మనీతి వెంకటేశ్వర్లు, మానవ హక్కుల సంఘం అధ్యక్షులు షేక్ గౌస్, మితికాల గురవయ్య, చిపి శ్రీనివాసులు, వైద్య సిబ్బంది, సచివాలయ సిబ్బంది, పంచాయతీ కార్యదర్శి బి తిరుపతయ్య తదితరులు పాల్గొన్నారు.
కనిగిరి: కనిగిరి మండలం ఎన్ గొల్లపల్లి పంచాయతీలో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం బుధవారం జరిగింది. ముఖ్య అతిథులుగా కనిగిరి జడ్పిటిసి మడతల కస్తూరిరెడ్డి, ఎంపీపీ దత్తులూరు ప్రకాశం పాల్గొన్నారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరికీ ఆధునిక వైద్య సేవలు అందజేయాలనే ఉద్దేశంతో సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి అమలు చేస్తున్న జగనన్న ఆరోగ్య సురక్ష పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు సిద్ధారెడ్డి, హరిరెడ్డి, సంగటి మహేంద్రరెడ్డి, మెట్ట రమేష్, వైద్యులు, అంగన్‌వాడీ కార్యకర్తలు, సూపర్‌వైజర్లు పాల్గొన్నారు.
కొనకనమిట్ల: కొనకనమిట్ల మండలం నాగంపల్లి సచివాలయం వద్ద జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని సర్పంచ్ తాతిరెడ్డి చిన్నవెంకటరెడ్డి, ఎంపిటిసి కోండ్రు వెంకటేశ్వర్లు ప్రారంభించారు. సర్పంచ్ మాట్లాడుతూ జగనన్న సురక్ష శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపిడిఒ అద్దంకి శ్రీనివాస్‌మూర్తి, జూనియర్ అసిస్టెంట్ షుకూర్, వైద్యులు నరేంద్ర, నేత్ర వైద్యులు, గైనకాలజిస్ట్, మాజీ సర్పంచ్ తాతిరెడ్డి పెద్దవెంకటరెడ్డి, వైసిపి నాయకులు గోపాల్‌రెడ్డి, విడగొట్టు అంజయ్య, పంచాయతీ సెక్రటరీ ఖాశిం, రసూల్, ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
హనుమంతునిపాడు: మండల పరిధిలోని లింగంగుంట్ల గ్రామంలో జగనన్న సురక్ష కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎంపీపీ గాయం సావిత్రి పాల్గొని మాట్లాడుతూ జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో వేల సంఖ్యలో రోగాలకు వైద్యం అందిస్తున్నారని, ప్రతి ఇంటిలోనే ఆరోగ్య సమస్యలను గుర్తించి మెరుగైన వైద్యం అందిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో హరిబాబు, మండల సచివాలయ కన్వీనర్ మద్ది తిరుపతయ్య, వైస్ ఎంపీపీ కొదమల బెంజిమెన్, రుద్రపాటి శోభ, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.










