Oct 20,2023 22:35

జగనన్న ఆంధ్రాకి మళ్లీ: వైసిపి

జగనన్న ఆంధ్రాకి మళ్లీ: వైసిపి
ప్రజాశక్తి - పుత్తూరు టౌన్‌ : ప్రజల కోసం సంక్షేమం, అభివద్ధిని అమలు చేస్తున్న జగనన్న ఆంధ్రకు మళ్లీ కావాలి అని మంత్రి రోజా సోదరులు వై రాంప్రసాద్‌ రెడ్డి పేర్కొన్నారు. 'ఎందుకు ఏపీకి జగన్‌ కావాలి?' పై పుత్తూరు, వడమాలపేట మండలాల సమీక్షా సమావేశం శుక్రవారం నిర్వహించారు. ఎందుకు ఏపీకి జగన్‌ కావాలి? కార్యక్రమం కింద ప్రతి రోజు సంక్షేమ పథకాల డిస్‌ప్లే బోర్డ్‌ ఆవిష్కరణ, వైసిపి జెండా ఎగురవేయడం, ఊరి, గ్రామ పెద్దలతో డిన్నర్‌ రాత్రి బస చేయడం, ఎందుకు ఆంధ్రాకి జగనే కావాలి? అనే అంశంపై ఇంటింటి ప్రచారం నిర్వహించాలని పిలుపు నిచ్చారు. ఎందుకు ఏపీకి జగన్‌ కావాలి'' కార్యక్రమం మండల పార్టీ కన్వీనర్లు, సచివాలయం కన్వీనర్లు, గహ సారధులు, గ్రామ, వార్డు వాలంటీర్లు, పార్టీ మద్దతుదారులు, లబ్ధిదారులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. టిడిపి నిర్వహిస్తున్న అబద్దపు ప్రచారాన్ని ప్రతి ఒక్కరూ తిప్పి కొట్టాలని కోరారు. ముఖ్యమంత్రి వైఎస్‌జగన్మోహన్‌ రెడ్డి చేస్తున్న అభివద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో పుత్తూరు, వడమాలపేట మండలాల మండల, సచివాలయం కన్వీనర్లు, ఎంపీపీలు, వైస్‌ ఎంపీపీలు, రాష్ట్ర డైరెక్టర్లు, మండల పార్టీ ఉపాధ్యక్షులు, జనరల్‌ సెక్రటరీల, వైసిపి నాయకులు పాల్గొన్నారు.