ప్రజాశక్తి-చల్లపల్లి : జగనన్న సురక్ష పథకం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చారిత్రాత్మక నిర్ణయంఅని పలువురు పేర్కొన్నారు. మండల పరిధిలోని యార్లగడ్డ సచివాలయంలో బుధవారం జగనన్న సురక్ష పథకం కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీడీవో చిన్న రాట్నాలు మాట్లాడుతూ జగనన్న సురక్షతో, ప్రజలకు ప్రభుత్వ సేవలు ఇంటి ముందుకే వచ్చాయని అన్నారు. ప్రజలకు అవసరమైన పథకాలు లేదా ధ్రువపత్రాలకు సంబంధించిన ఏవైనా సమస్యలు ఉంటే వాటిని గుర్తించి పరిష్కంచేందుకు జగనన్న సురక్ష పథకం ఏర్పాటు చేశారని అన్నారు. ప్రభుత్వం ప్రతి ఇంటికి వెళ్లి సమగ్ర సర్వే నిర్వహిస్తోందని తెలిపారు. ఈ ఓ ఆర్ డి బూరేపల్లి అశోక్ కుమార్ మాట్లాడుతూ సమస్యలను సమర్ధవంతంగా పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రతి సచివాలయంలో ప్రత్యేక శిబిరాలను నిర్వహిస్తోందిఅని అన్నారు. ఈ శిబిరాలు ధృవపత్రాలను పంపిణీ చేయడానికి, పౌరుల సమస్యలను సమర్థవంతంగా పరిష్కరించడానికి ఒక వేదికగా పనిచేస్తున్నాయి అని అన్నారు. మండలంలో అత్యుత్తమము కనపర్చి 87% సర్వే పూర్తి చేసి 543 సర్వీస్ నుంచి మండలంలోని ప్రథమ స్థానంలో యార్లగడ్డ సచివాలయం నిలిచిందని అన్నారు. ప్రత్యేకంగా కృషిచేసి న సచివాలయం సిబ్బందిని, వాలంటీర్లను ప్రత్యేకంగా అధికారులు అభినందించారు. ఈ సందర్భంగా స్థానిక పీహెచ్సీ సిబ్బంది ఆదేశిపులని ఏర్పాటు చేశారు. లబ్ధిదారులకు డిప్యూటీ తాసిల్దార్ కుమార్ ధ్రువపత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో సచివాలయం ప్రత్యేక అధికారి సిహెచ్.బాపనయ్య, ఎమ్మార్వో కార్యాలయం సీనియర్ అసిస్టెంట్ కృష్ణ మోహన్ రావు, పంచాయతీ కార్యదర్శి కొండవీటి హరీష్ కుమార్, ఎం ఎల్ ఓ లంకే శ్రీనివాసరావు, సచివాలయం సిబ్బంది, వాలంటీర్లు, గ్రామ ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు.










