ప్రజాశక్తి - హోళగుంద
ఆంధ్ర రాష్ట్రాభివృద్ధి ముఖ్యమంత్రి జగన్‌తోనే సాధ్యమని, ముఖ్యమంత్రి సూచనలతో ప్రజలకు నేరుగా సేవ చేసుకునే అవకాశం దక్కిందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరామ్ తెలిపారు. 'గడపగడపకు మన ప్రభుత్వం'లో భాగంగా గురువారం హోళగుంద బీసీ కాలనీలో ఆయన పర్యటంచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన విధంగా ప్రతి సంక్షేమ పథకమూ అందించామని తెలిపారు. అంతకుముందు 'జగనన్న సురక్ష'లో పాల్గొని రైతులకు, విద్యార్థులకు ధ్రువపత్రాలను పంపిణీ చేశారు. వైసిపి ఆలూరు నియోజకవర్గ బాధితులు నారాయణ స్వామి, ఎంపిపి తనయుడు ఈషా, నాయకులు తోక వెంకటేష్, మండల కన్వీనర్ షఫీవుల్లా, తహశీల్దార్ హుస్సేన్ సాబ్, దినోజు కుమార్, హౌసింగ్ అధికారి ఆదినారాయణ, పిఆర్ ఎఒ సోమప్ప, ఎఒ ఆనంద్, పంచాయతీ కార్యదర్శి రాజశేఖర్ పాల్గొన్నారు.
ధ్రువపత్రాలను అందజేస్తున్న మంత్రి గుమ్మనూరు










