జగన్‌కు మహిళా శక్తి చూపించండి
ప్రజాశక్తి - మంత్రాలయం
సిఎం జగన్ మోహన్ రెడ్డికి మహిళా శక్తి అంటే ఏంటో చూపిం చాలని టిడిపి మంత్రాలయం నియోజకవర్గ ఇన్చార్జ్ పాలకుర్తి తిక్కారెడ్డి అన్నారు. ఆదివారం టిటిడి జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకు నిరసనగా పాలకుర్తి తిక్కారెడ్డి అధ్వర్యంలో స్థానిక రాఘవేంద్రసర్కిల్‌లో చేపట్టిన రీలే నిరహార దీక్షలో తెలుగు మహిళలు మేము సైతం అంటూ పాల్గొన్నారు. ఈ సందర్భంగా టిడిపి మంత్రాలయం నియోజకవర్గ ఇన్చార్జ్ పాలకుర్తి తిక్కారెడ్డి మాట్లాడుతూ అభివృద్ధి చేయలేక, ప్రజలలోకి పోవడానికి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి చేతకావడం లేదని అన్నారు. రానున్న రోజుల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందనే కక్షతోనే చంద్రబాబుపై అక్రమ కేసులు పెడుతున్నారని అన్నారు. మహిళలు సైతం చంద్రబాబుకు మద్దతుగా బయటికి వచ్చి దీక్షలు చేస్తూంటే కచ్చితంగా జగన్ మోహన్ రెడ్డి ఇంటికి వెళ్ళడం ఖాయమన్నారు. టిడిపి నియోజకవర్గ పరిశీలకురాలు శివబాల మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా.. ఎమ్మెల్యేగా తిక్కారెడ్డిని గెలిపించాలని కోరారు. రెండుసార్లు ఎమ్మెల్యేగా ఓడిపోయినా మంత్రాలయం నియోజకవర్గానికి తిక్కారెడ్డి ఎంతో అభివృద్ధి చేశారని కొనియాడారు. పార్టీలో వర్గ విభేదాలను వీడాలని అన్నారు. ఈసారి ఎమ్మెల్యేగా తిక్కారెడ్డి గెలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. అనంతరం చంద్రబాబు విడుదల కోసం సంతకాలు సేకరణ చేశారు.ఈ దీక్షకు టిడిపి రాష్ట్ర కార్యదర్శి పాలకుర్తి శ్రీనివాస్ రెడ్డి, కురువ సాధికార రాష్ట్ర నాయకులు నాగరాజు,జయ రాముడు, యల్లప్ప, బానుప్రకాష్ సంఘీభావం తెలియజేశారు. దీక్షలో.. టిడిపి ఇన్‌చార్జ్ పాలకుర్తి తిక్కారెడ్డి సతీమణి పాలకుర్తి వెంకటేశ్వరమ్మ, టిడిపి రాష్ట్ర కార్యదర్శి పాలకుర్తి శ్రీనివాస్ రెడ్డి సతీమణి పాలకుర్తి కల్పనమ్మ, రాష్ట్ర నాయకురాలు నరవ శశిరేఖ, మాలపల్లి రాగవేణమ్మ, తెలుగు మహిళ జిల్లా కార్యదర్శి నాడిగేని నరసమ్మ, రూతమ్మ, శంకుతలమ్మ, లక్ష్మి, చావిడి రామలక్ష్మి, మాధవరం కావ్య, మాధవరం నిర్మలమ్మ, బెళగల్ సర్పంచ్ పద్మమ్మ, దుద్ది సర్పంచ్ వరలక్ష్మి, చిన్న భూంపల్లి గోవిందమ్మ, ఈరేశమ్మ, పెద్ద భూంపల్లి లక్ష్మి, నాగలక్ష్మి, కోల్మ్ మేన్ పేట మంగమ్మ ఉన్నారు. అన్ని గ్రామాలు మహిళలు దీక్షలో కుర్చున్నావారు. వీరికి మద్దతుగా తెలుగు రైతు రాష్ట్ర కార్యదర్శి అడివప్ప గౌడ్, తెలుగు యువత నియోజకవర్గం అధ్యక్షులు బాపురం సుదీర్ రెడ్డి, బిసి సీనియర్ నాయకులు వక్రాని వెంకటేశ్వర్లు, బిసి సెల్ అధ్యక్షులు మాధవరం అమర్నత్ రెడ్డి, అశోక రెడ్డి, చావిడి వెంకటేష్, విజయ రామిరెడ్డి,చిన్న భూంపల్లి మాజీ సర్పంచ్ నరసింహులు, యస్‌సి సెల్ నాయకులు మారేప్ప, యోబు,తెలుగు యువత కోసిగి మండలం అధ్యక్షులు నాడిగేని మహదేవ్,చిలకలడోణ హనుమంతు,సూగురు నాగేష్, రాగన్న, వట్టేప్ప గారి నరసింహులు, మేకల నరసింహులు,పెద్ద భూంపల్లి జనార్ధన్,బెళగల్ ప్రభాకర్ రెడ్డి,సిద్దప్ప గౌడ్, రామయ్య,ఉసేని, తిరుమలేష్, శివ, బానుప్రకాష్,ఐ టిడిపి సల్మాన్ రాజు, చిదానంద, హనుమంతు, బసవరాజు తదితరులు పాల్గొన్నారు.
పిచ్చొడి చేతిలో రాష్ట్రం : కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి
ఆలూరు : రాష్ట్రం పిచ్చోడి చేతిలో రాయి అన్నట్టు ఉందని మాజీ కేంద్రసహాయ మంత్రి కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డి అన్నారు. ఆలూరు లో కోట్ల సుజాతమ్మ ఆధ్వర్యంలో హోళగుంద మండల కార్యదర్శి తిప్పయ్య అధ్యక్షతన టిడిపి నాయకులు, కార్యకర్తలు చేపట్టిన సామూహిక నిరాహారదీక్షకు కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డి సంఘీభావ తెలిపారు. ఈసందర్భంగా కోట్ల మాట్లాడుతూ చంద్రబాబు నాయుడుపై రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసులపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయని అన్నారు. ఈకార్యక్రమంలో టిడిపి రాష్ట్ర నాయకులు నారాయణ, ఆదాం, శేషగిరి, జిల్లా నాయకులు భాస్కర్, నాగరాజు, కొమ్ము రామంజి, మండల కన్వీనర్లు అశోక్ యాదవ్, టిడిపి సినియర్ నాయకులు పీరన్న, సుళావాయి రాఘవేంద్ర, సర్పంచి సుధాకర్, మల్లికార్జున, మంజు నాథ్ గౌడ్, సత్యనారాయణ రెడ్డి, నబిరసూల్ తదితరులు పాల్గొన్నారు. ఎమ్మిగనూరు : చంద్రబాబుపై అక్రమంగా కేసు నమోదు చేశారని, ప్రజలు అండగా నిలిచారని టిడిపి మహిళా నాయకురాలు గోనెగండ్ల సర్పంచ్ హైమావతి పేర్కొన్నారు. చంద్రబాబుకు తోడుగా అనే నినాదంతో స్థానిక సోమప్ప సర్కిల్లో కండవాలను కప్పుకొని రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఆదోని : చంద్రబాబు నాయుడి అక్రమ అరెస్టు నిరసిస్తూ ప్రపంచవ్యాప్తంగా స్వచ్ఛందంగా నిరసన వ్యక్తం చేస్తూ జనం అండగా ఉన్నారని, బాబు చరిష్మా తగ్గలేదని మాజీ ఎమ్మెల్యే ఆదోని టిడిపి నియోజకవర్గ ఇన్చార్జి మీనాక్షి నాయుడు పేర్కొన్నారు. టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడి అరెస్టుకు నిరసనగా టిడిపి ఇన్చార్జి మాజీ శాసనసభ్యులు కె మీనాక్షి నాయుడు ఆదేశాల మేరకు టీడీపీ అబ్జర్వర్ గాజుల ఆదెన్న ఆధ్వర్యంలో ఆదోని ఎన్టీఆర్ విగ్రహం దగ్గర రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. దీక్ష శిబిరంలో వాల్మీకి సోదరులు క్లస్టర్ అంజి, రాష్ట్ర తెలుగు రైతు జనరల్ సెక్రటరీ అయ్యన్న, ఎక్స్ ఎంపీటీసీ నాగరాజ్, ఉరుకుందు, యూనిట్ మెంబర్ మల్లికార్జున, నాగేంద్ర, గోపాల్, కేశప్ప, శ్రీరాములు, నారాయణ కూర్చున్నారు. మీనాక్షి నాయుడు మాట్లాడుతూ ఆధారాలులేని కేసులు పెట్టి అక్రమంగా చంద్రబాబును అరెస్టు చేసి ప్రజాస్వామ్యాన్ని అపహస్యం చేస్తున్నారని విమర్శించారు. అనంతరం రిలే దీక్ష శిబిరానికి మద్దతుగా మున్సిపల్ రోడ్‌లో మోకాళ్ళతో నిలిచి నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి సీనియర్ నాయ కులు ఉమాపతి నాయుడు, కర్నూలు జిల్లా పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి భూపాల్ చౌదరి, నాయకులు బుద్ధారెడ్డి వాల్మీకి వెంకటేష్, బసాపురం రామస్వామి, తిమ్మప్ప చాగి మల్లికార్జున్రెడ్డి అమర్ మధిర వీరేష్, బసవ , రాజు, కుమారి,విరుపా పురం స్వామినాథ, రామకష్ణ , మల్లికార్జున, శ్రీనివాస్ ఆచారి ఉన్నారు. గడ్డం ఫక్రుద్దీన్ టిఎన్‌ఎస్‌ఎఫ్ జిల్లా అధ్యక్షుడు రామాంజనేయులు, సేసిరెడ్డి,చాంద్,బాబునాయుడు, మా బాష ఉన్నారు.










