Oct 19,2023 20:04

కౌతాళంలో మాట్లాడుతున్న తిక్కా రెడ్డి

ప్రజాశక్తి - కౌతాళం
మచ్చ లేని నాయకుడు చంద్రబాబుపై అక్రమ కేసులు బనాయించి పైశాచిక ఆనందం పొందుతున్న జగన్మోహన్‌ రెడ్డికి రోజులు దగ్గర పడ్డాయని టిడిపి ఇన్‌ఛార్జీ పాలకుర్తి తిక్కారెడ్డి పేర్కొన్నారు. గురువారం మండలంలోని ఉరుకుంద గ్రామంలో 'బాబుతో నేను' నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుపై అక్రమ కేసులు పెట్టి కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు. మండల నాయకులు చెన్నబసప్ప, క్లస్టర్‌ ఇన్‌ఛార్జీలు కోట్రేష్‌ గౌడ్‌, అడివప్ప గౌడ్‌, వెంకటపతి రాజు, సీనియర్‌ నాయకులు సాయిబాబా, టిప్పు సుల్తాన్‌, రమేష్‌ గౌడ్‌, వెంకట్‌ రెడ్డి, శివప్ప గౌడ్‌, రాజాబాబు పాల్గొన్నారు.