ప్రజాశక్తి - చిప్పగిరి
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో సంక్షేమ పథకాలు అందించడం ద్వారా అన్ని వర్గాల ప్రజలకు సముచిత స్థానం కల్పించారని పంచాయతీ రాజ్ ఉమ్మడి జిల్లాల వింగ్ అధ్యక్షులు, జడ్‌పిటిసి విరుపాక్షి తెలిపారు. సోమవారం చిప్పగిరిలో వైసిపి సీనియర్ నాయకులు మహానంది గృహ ప్రవేశానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఇటీవల ప్రారంభమైన 'జగనన్న ఆరోగ్య సురక్ష'లో పేదలు ఆరోగ్య పరీక్షలు చేయించుకుంటున్నారని తెలిపారు. ఇలాంటి కార్యక్రమాలు రాబోయే రోజుల్లో కూడా నిర్వహిస్తే పేదలు బాగుంటారని ప్రతి పేదవాడు జగనన్నను ఆశీర్వదిస్తున్నారని చెప్పారు. వచ్చే జనవరి నుంచి వృద్ధులకు రూ.3 వేల పింఛను అందజేస్తారన్నారు. వచ్చే సాధారణ ఎన్నికల్లో వైసిపి అద్భుత విజయాలు సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. వైసిపి నాయకులు పాల్గొన్నారు.
గృహ ప్రవేశ వేడుకలో పాల్గొన్న జడ్‌పిటిసి విరుపాక్షి










