హిందూపురం : నాలుగేళ్ల వైసిపి పాలనలో రాష్ట్రంలో ప్రజలందరికీ అన్యాయమే జరిగిందని టిడిపి నాయకులు తెలిపారు. రాష్ట్ర ప్రయోజనాలు తొక్కి పెట్టిన జగనాసుర పాలనను అంతమొందించాలని పేర్కొంటూ సోమవారం టిడిపి నాయకులు పెనుకొండ రోడ్డులో నిరసన తెలిపారు. ఈ సందర్బంగా జగన్ ప్రతిమతో రావణాసుర ప్లకార్డులను తగలబెట్టే ప్రయత్నం చేయగా, పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆగ్రహంతో వాటిని చింపి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జగన్ అక్రమ ఆస్తుల కేసులో నిందితుడుగా 16 నెలల పాటు జైలు శిక్ష అనుభవించారన్నారు. రాష్ట్రంలో ఇసుక, మద్యం, మైనింగ్, మాఫియాలు నడుస్తోందన్నారు. వైకాపా ప్రభుత్వ పాలనపై ప్రజల్లో ఎంత అసంతప్తితో ఉన్నారనన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి అంబికా లక్ష్మీనారాయణ, పట్టణ అధ్యక్షులు డిఈ రమేష్ కుమార్, రాష్ట్ర కార్యదర్శులు కొల్లకుంట అంజినప్ప, రామాంజినమ్మ, రూరల్ మండల కన్వీనర్ అశ్వర్థ రెడ్డి, అసెంబ్లీ అధ్యక్షులు బాబా ఫక్రొద్దిన్, రాష్ట్ర బిసి, తెలుగు మహిళా కార్యదర్శిలు బేవినహల్లి ఆనంద్, అమర్నాథ్, పరిమళ, వెంకటరమణ, సీనియర్ నాయకులు నెట్టప్ప, రాము, మొద శివకుమార్, కౌన్సిలర్లు సతీష్ కుమార్, రాఘవేంద్ర, దుర్గా నవీన్, ఐటీడీపీ అధ్యక్షులు నజీర్ అహ్మద్, పార్లమెంట్ కార్యదర్శి ఆదినారాయణ, నందీష్ పార్లమెంటు లీగల్ సెల్ అధ్యక్షులు శివశంకర్, నాయకులు దాదా పీర్, కొట్నుర్ నాగభూషణ, రామకష్ణారెడ,ి్డ హనుమంత రాయుడు, షబ్బీర్, అమీన్, అశోక్, అబూబకర్, చిన్నారెడ్డి పాల్గొన్నారు.










