జగ్జీవన్‌రామ్ విగ్రహం ఏర్పాటు పనులకు శంకుస్థాపన
ప్రజాశక్తి-పమిడిముక్కల
భారతదేశ మాజీ ఉప ప్రధాని, మాజీ కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి బాబూ జగ్జీవన్‌రామ్ పేద ప్రజల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారని మామిళ్ళపల్లి సర్పంచ్ ఆముదాలపల్లి సుబ్రహ్మణ్యం అన్నారు. పమిడిముక్కల మండలంలోని మామిడిపల్లి శివారు గండ్రపువానిగూడెంలో బాబూజగ్జీవన్‌రామ్ విగ్రహం స్థాపన పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ జగ్జీవన్‌రామ్ కుమార్తె మీరాకుమార్ లోక్‌సభ స్పీకర్‌గా ఎంతో సమర్థవంతంగా పనిచేశారన్నారు. గండ్రపువానిగూడెంలో జగ్జీవన్‌రామ్ విగ్రహం ఏర్పాటుకు పూనుకోవటం పట్ల ఆయన సంతోషం వ్యక్తంచేశారు. సిఎం వైఎస్ జగన్మోహనరెడ్డి స్ఫూర్తితో పామర్రు శాసనసభ్యులు కైలే అనిల్‌కుమార్ నిరంతరం పేదల సంక్షేమం కోసం పనిచేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో పమిడిముక్కల మండల పరిషత్ ఉపాధ్యక్షులు కొడమంచిలి మహేష్, కొడాలి రవి, గండ్రపు రాజేందర్, గండ్రపు వెంకటేశ్వరరావు, మారపాక మహేశ్వరరావు, వైసిపి పమిడిముక్కల మండల అధ్యక్షులు యలమంచిలి గణేష్, అగినపర్రు కోపరేటివ్ బ్యాంక్ అధ్యక్షులు అక్కినేని సతీష్, జువ్వనపూడి సుబ్రహ్మణ్యం, ఉపాధ్యాయులు సీనయ్య మాస్టర్, పలువురు ఎమ్మార్పీఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.










