Sep 17,2023 21:10

ప్రజాశక్తి - జంగారెడ్డిగూడెం
   వినాయక చవితి ఉత్సవాల నేపథ్యంలో స్థానిక జెపి సెంటర్‌లో ట్రాఫిక్‌ సమస్య నెలకొంది. ఆదివారం సాయంత్రం వినాయక చవితి ఉత్సవ విగ్రహాలు, పూజా సామాగ్రి వస్తువులు రోడ్లపై అమ్మకానికి సిద్ధం చేశారు. ఈ క్రమంలో సాయంత్రం పూట అధిక సంఖ్యలో కొనుగోలుదారులు రావడంతో వాహనాల రద్దీ పెరిగింది. విగ్రహాలను తరలించేందుకు వచ్చిన ట్రాక్టర్లు, పూజా సామాగ్రి కొనుగోలు చేసే వాహనాలతో జెపి సెంటర్‌ కిక్కిరిసిపోయింది. ముందస్తు సమాచారం ఉన్నప్పటికీ ట్రాఫిక్‌ నియంత్రించడంలో పోలీస్‌ సిబ్బంది విఫలమయ్యారని పలువురు వాహనదారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.