ప్రజాశక్తి - పార్వతీపురంటౌన్ : జగనన్న ఆరోగ్య సురక్ష ( జెఎఎస్) కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి సి విష్ణు చరణ్ అన్నారు. గురువారం స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరాన్ని పిఒ తనిఖీ చేశారు. జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో నిపుణులైన వైద్యులు పరీక్షలు నిర్వహిస్తారని చెప్పారు. ప్రభుత్వం మంచి సంకల్పంతో ప్రారంభించిందని ఆయన చెప్పారు. వైద్య సేవలు అందిన తీరును పరిశీలించారు.
వీరఘట్టం: మండలంలోని కంబరలో గురువారం జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యాధికారులు పి.ఉమామహేశ్వరి, మానస వివిధ రకాలైన రోగులకు తనిఖీలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపిడిఒ జిజె ప్రసాద్, వైద్య, సచివాలయ సిబ్బందితో పాటు వాలంటీర్లు, గ్రామస్తులు పాల్గొన్నారు.
సీతానగరం: మండలంలోని బగ్గదొరవలసలో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అలజంగి జోగారావు మాట్లాడుతూ వివిధ రకాల రోగులను తనిఖీలు నిర్వహించి పూర్తిస్థాయి వైద్యం అందించడం జరుగుతుందన్నారు ఈ అవకాశాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో తహశీల్దార్ ఎంవి రమణ, ఎంపిడిఒ కృష్ణమోహన్‌రెడ్డి, జెడ్పీటీసీ ఎం.బాబ్జీ, వైద్యాధికారులు, వైసిపి నాయకులు పాల్గొన్నారు.
కొమరాడ : మండలంలోని కెమిసిల, పెద్దమరికిలో జరిగిన జగనన్న ఆరోగ్య సురక్ష వైద్య శిబిరాలను జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా బగాది జగన్నాథరావు ం తనిఖీ చేశారు. జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరాల వద్ద రిసెప్షన్, మందులు, పరీక్షలు, వైద్యుల సలహాలు, వివరాల నమోదు కౌంటర్లను, పౌష్ఠికాహారం ప్రదర్శన, అవగాహన శాలలను పరిశీలించారు. ప్రతి ఒక్కరికీ మంచి వైద్య సేవలు అందించాలని వైద్య శిబిరాలను ఏర్పాటు చేసిందని ఆయన వివరించారు. ప్రజల సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో వైద్య నిపుణులు డా. భోగేశ్వర రావు, తదితరులు పాల్గొన్నారు.
సాలూరు రూరల్ : మండలంలోని తుండ పంచాయతీలో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమ జరిగింది. కార్యక్రమంలో వైసిపి జిల్లా కార్యదర్శి, దండి శ్రీనివాసరావు, అధ్యక్షులు సువ్వాడ భరత్ శ్రీనివాసరావు మాట్లాడుతూ గనన్న సురక్ష కార్యక్రమం ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని కోరారు. కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ నూకయ్య, ఎంపిడిఒ జి.పార్వతి, ఎంపిటిసి సభ్యులు ఆదయ్య, వైద్యాధికారి కనకాల శ్రీకాంత్ ,గ్రామ సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు .
భామిని : మండలం లోని చిన్నదిమిలి సచివాలయంలో బాలేరు వైద్య సిబ్బంది డాక్టర్ దీపికరాణి, డాక్టర్ ఫణికుమార్, ఎముకలు వైద్య నిపుణులు కిశోర్, పిల్లలు వైద్య నిపుణులు హారిక 397 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి, మందులు అందజేసి, మెరుగైన వైద్యం కోసం 26 మందిని రెఫెర్ చేశారు. కార్యక్రమంలో వైస్ ఎంపిపి బోనగడ్డి ధర్మారావు, జెసిఎస్ కో ఆర్డినేటర్ కొత్తకోట చంద్రశేఖర్, వైసిపిజిల్లా ఉపాధ్యక్షులు కొవ్వాడ చిరంజీవులు, సర్పంచ్ లోతుగెడ్డ రవి, తహశీల్దార్ నీలాపు అప్పారావు, ఎంపిడిఒ జి.చంద్రరావు, సచివాలయం సిబ్బంది వున్నారు.
వైద్య సేవలపై ఆరా
బలిజిపేట : మండలంలోని సుభద్రలో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి(డిఐఒ) డాక్టర్ టి.జగన్మోహనరావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎంపిడిఒ కె.విజయలక్ష్మి తో కలసి అక్కడ ఏర్పాటు చేసిన కౌంటర్లు లో అందజేస్తున్న వైద్య సేవలను పరిశీలించారు. అక్కడ ప్రజలతో మాట్లాడి అందుతున్న వైద్య సేవలపై అడిగి తెలుసుకున్నారు. అంగన్వాడీ స్టాల్‌ను పరిశీలించారు. కార్యక్రమంలో వైద్యాధికారులు ఎం.శివగాయత్రి, డి.క్రాంతి కిరణ్మయి, స్పెషలిస్ట్ వైద్యులు, పంచాయతీ సెక్రటరీ బి. మోహనరావు, వైద్య, సచివాలయం, అంగన్వాడీ సిబ్బంది, గ్రామ వాలంటీర్లు పాల్గొన్నారు.










