సీతానగరం: జగనన్న ఆరోగ్య సురక్ష ( జెఎఎస్) సర్వే పక్కాగా జరగాలని కలెక్టర్ నిశాంత్ కుమార్ అధికారులను ఆదేశించారు. జగనన్న ఆరోగ్య సురక్ష సర్వేను మండలంలోని చినభోగిలిలో శని వారం పరిశీలించారు. జగనన్న ఆరోగ్య సురక్ష సర్వేలో భాగంగా ఇంటింటికీ ఆరోగ్య సిబ్బంది వెళ్లడం, నిర్వహిస్తున్న ఆరోగ్య పరీక్షలను తనిఖీ చేశారు. జగనన్న ఆరోగ్య సురక్ష సర్వేలో దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న ఏ ఒక్కరూ తప్పిపోరాదని ఆయన స్పష్టం చేశారు. జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం ద్వారా పేదలందరికీ ఆరోగ్య భరోసా దక్కుతుందని చెప్పారు. ఇంటింటికీ వెళ్లి ప్రజల ఆరోగ్య అవసరాలను గుర్తించడం, అవసరమైన వారికి గ్రామాల్లోనే ఆరోగ్య శిబిరాలు నిర్వహించి వైద్యం అందించడం, పెద్ద ఆస్పత్రులకు సిఫార్సు చేయడం లక్ష్యంగా జగనన్న ఆరోగ్య సురక్ష పథకాన్ని రూపకల్పన చేశారని వెల్లడించారు. కార్యక్రమంలో భాగంగా ఇంటి వద్దనే ఏడు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరాల పట్ల ప్రజలకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. ఇంటింటికి ఆరోగ్య సర్వేలో ప్రతి గ్రామ, వార్డు సచివాయంలో ఎఎన్‌ఎం, ఆశాలు ఒక బృందంగా, సిహెచ్‌ఒలు, ఆశా కార్యకర్తలు మరో బృందంగా ఏర్పడి ప్రతి ఇంటినీ సర్వే చేయాలని స్పష్టం చేశారు. ఇంటి వద్ద ఏడు రకాల వైద్య పరీక్షలు నిర్వహించి వ్యాధిగ్రస్తులను తనిఖీ చేసి వారి జాబితా తయారు చేయాలని సూచించారు. ఈనెల 30 నుంచి ప్రారంభం కానున్న వైద్య శిబిరాలకు ఒపి చీటిలను అవసరమైన అందరికీ అందించాలని ఆదేశించారు. శిబిరంలో వైద్య నిపుణులు ఉంటారని, అన్ని మందులు అందుబాటులో ఉన్నాయని, శిబిరంలో మరో ఏడు రకాల వైద్య పరీక్షలు అందుబాటులో ఉంటాయని చెప్పారు. జెఎఎస్ శిబిరాలు విజయవంతం కావాలని ఆయన అన్నారు. ఆరోగ్య శిబిరాలకు ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ ఆస్పత్రుల నుండి ఒక స్పెషలిస్టు డాక్టర్ హాజరవుతారని చెప్పారు. నెల రోజులపాటు ప్రతి రోజూ శిబిరాలు జరుగుతా యన్నారు. మండలానికి ఒక గ్రామం చొప్పున రోజూ వైద్య శిబిరాలు కొనసాగుతాయని వెల్లడించారు. దీనివల్ల ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి గ్రామాల్లోనే స్పెషలిస్టు వైద్యులతో సత్వర వైద్యం అందుతుందని పేర్కొ న్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగిం చుకోవాలని కోరారు. వైద్య శిబిరం జరుగుతున్న ప్రతి చోటా ఔషధాలు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. అన్ని రకాల వైద్య పరికాలను అందుబాటులో ఉంచాలని అన్నారు. కార్యక్రమం విజయవతంగా పూర్తయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో డిఎంహెచ్‌ఒ డా బగాది జగన్నాథ రావు, తహశీల్దార్ ఎంవి రమణ, ఎంపిడిఒ ప్రసాద్, వైద్య, ఆరోగ్య సిబ్బంది, ఎఎన్‌ఎంలు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.










