Sep 30,2023 01:14

విద్యార్థితో చదివిస్తున్న గంగరాజు

ప్రజాశక్తి -అనంతగిరి: మండలంలోని గుమ్మకోట ఏపిఆర్‌ గురుకులం పాఠశాలను జెడ్‌పిటిసి గంగరాజు శుక్రవారం సందర్శించారు. మౌలిక వసుతులు, విద్యార్థులకు అందుతున్న విద్యాబోధన, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ప్రిన్సిపాల్‌ నరసింహమూర్తి మాట్లాడారు. పాఠశాలలో కరెంట్‌ సింగిల్‌ ఫేస్‌ కావడంతో విద్యుత్‌ లోడు సరిపోలేదని డబ్బల్‌ ఫేస్‌, త్రి ఫేస్‌ ఇవ్వాలని ప్రిన్సిపాల్‌ కోరారు. పాఠశాలలో అదనపు బోరుకు జడ్పిటిసి దృష్టికి తీసుకువచ్చారు. అనంతరం గంగరాజు మాట్లాడుతూ, విద్యార్థులకు నాణ్యమైన విద్యని అందించాలని ఉపాధ్యాయులకు సూచించారు. సమస్యలను పరిష్కారం కోసం జిల్లా కలెక్టర్‌ సుమీత్‌ కుమార్‌, ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి .అభిషేక్‌, జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ జల్లిపల్లి.సుభద్ర ల దృష్టికి తీసుకు వెళ్లి సమస్యల పరిష్కారాన్ని కృషి చేస్తానన్ని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టోకురు సిపిఎం సర్పంచ్‌ కిల్లో.మోస్య, సిపిఎం మండల కార్యదర్శి సోమెల నాగులు, గిరిజన సంఘం కార్యదర్శి జన్ని సుబ్బారావు పాల్గొన్నారు.