Jul 28,2023 21:06

రాహుల్‌ కుమార్‌ రెడ్డి

జాయింట్‌ కలెక్టర్‌గా రాహుల్‌ కుమార్‌ రెడ్డి
ప్రజాశక్తి - నంద్యాల కలెక్టరేట్‌

     నంద్యాల జిల్లా జాయింట్‌ కలెక్టర్‌గా తాటిమాకుల రాహుల్‌ కుమార్‌ రెడ్డిని నియమిస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో ఇక్కడ జాయింట్‌ కలెక్టర్‌గా పని చేసిన టి.నిశాంతిని బదిలీ చేశారు. అప్పటి నుండి జిల్లా కలెక్టర్‌ మనజీర్‌ జిలానీ సామూన్‌ జెసి అదనపు బాధ్యతలు చూస్తున్నారు. కడప జిల్లాకు చెందిన రాహుల్‌ కుమార్‌ రెడ్డి 2020లో ఏలూరులో ట్రైనీ కలెక్టర్‌గా విధులు నిర్వహించారు. 2022 అక్టోబర్‌ 16న శ్రీకాకుళం జిల్లా టెక్కలి సబ్‌ కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయనను ప్రమోషన్‌పై నంద్యాల జిల్లా జాయింట్‌ కలెక్టర్‌గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఈ నెల 31న గాని, ఆగస్టు మొదటి వారంలో జాయింట్‌ కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టే అవకాశాలు ఉన్నాయి.