Jul 03,2023 20:56

జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ టి.నిశాంతి

జాయింట్‌ కలెక్టర్‌ టి.నిశాంతి బదిలీ
ప్రజాశక్తి - నంద్యాల కలెక్టరేట్‌

     నంద్యాల జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ టి.నిశాంతి బదిలీ అయ్యారు. ఈ మేరకు సోమవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. ఇన్‌చార్జ్‌ జాయింట్‌ కలెక్టర్‌ బాధ్యతలను జిల్లా కలెక్టర్‌ మనజీర్‌ జిలానీ సామూన్‌కు అప్పగిస్తూ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అయితే జెసి టి.నిశాంతికి ఎక్కడ పోస్టింగ్‌ ఇవ్వలేదు. సాధారణ పరిపాలన విభాగంలో రిపోర్ట్‌ చేయాలని చీప్‌ సెక్రటరీ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. జెసిగా టి.నిశాంతి నంద్యాల జిల్లాకు వచ్చి ఎనిమిది నెలలు కూడా గడవకముందే బదిలీ చేయడంపై సర్వత్రా చర్చ నెలకొంది. ఇటీవల కాలంలో జెసిపై పలు ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే ఆమెను బదిలీ చేసి ఉండవచ్చని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.