ప్రజాశక్తి-హిందూపురం : నేషనల్ ఇండిపెండెంట్ స్కూల్ అలయన్స్ న్యూఢిల్లీ వారు జాతీయ స్థాయిలో డిసెంబరు 22న నిర్వహించిన పరీక్షల్లో పాంచజన్య బ్రిలియంట్స్ హై స్కూల్ కు చెందిన విద్యార్థి ప్రతిభ కనపర్చింది. పాఠశాల విద్యార్థిని రేణుప్రియ ద్వితీయ స్థానం సాధించింది. ఈ మేరకు బుధవారం పాఠశాలలో విద్యార్థి రేణు ప్రియను పాఠశాల అధ్యక్షులు పాంచజన్య శ్రీనివాసులు, ఎన్‌ఐఎస్ ఎ వారు పంపినక్యాష్ అవార్డు, షీల్డ్ లను అందించారు. ఈ సందర్బంగా పాంచజన్య శ్రీనివాసులు మాట్లాడుతు జాతీయ స్థాయిలో నిర్వహించిన పరీక్షల్లో పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న రేణు ప్రియ ద్వితీయ స్థానం సాధించడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సెక్రటరీ నందకుమార్, ఎఒ భాస్కర్, హెచ్‌ఎం గాయిత్రి, ఎహెచ్‌ఎంలు శశికళ, సతీష్ కుమార్, షేక్ అబ్దుల్ రజాక్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.










