Mar 18,2023 22:32

vamsi

జాతీయ ఫెన్సింగ్‌ క్రీడల్లోనూ రాణించాలి : ఎమ్మెల్యే
ప్రజాశక్తి-గన్నవరం
జాతీయస్థాయి ఫెన్సింగ్‌ క్రీడల్లో రాణించి రాష్ట్రానికి పేరు తేవాలని ఎమ్మెల్యే డాక్టర్‌ వల్లభనేని వంశీ మోహన్‌ ఆకాంక్షించారు.గన్నవరం పట్టణానికి చెందిన దనియాల నాగరాజు కుమార్తె నాగ ప్రత్యూష ఇటీవల నిర్వహించిన ఫెన్సింగ్‌ క్రీడా పోటీలలో పాల్గొని మహారాష్ట్రలోని పూణేలో ఈనెల 25 వ తేదీ నుండి జరగనున్న 4వ జాతీయస్థాయి ఫెన్సింగ్‌ పోటీల్లో పాల్గొనేందుకు ఎంపికైంది. ఆ పోటీల్లో అత్యుత్తమ ప్రదర్శన కనపరచు నిమిత్తం అత్యాధునిక విద్యుత్‌ ఆయుధం కొనుగోలు చేయాల్సివుంది. బాలిక తండ్రి నాగరాజు స్థానిక శాసనసభ్యులు డాక్టర్‌ వల్లభనేని వంశీని సంప్రదించి విద్యుత్‌ ఆయుధం కొనుగోలుకు ఆర్ధిక సహాయం కోరారు. రూ.25 వేలు ఆర్ధిక సహాయాన్ని తన సొంత నిధుల నుండి మంజూరు చేశారు. జాతీయ క్రీడలలో ప్రత్యూష అత్యుత్తమ ప్రతిభ కనపరచి గన్నవరం పట్టణానికి మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని ఎమ్మెల్యే వంశీ ఆకాంక్షించారు. నగదును నియోజకవర్గ వై.ఎస్‌.ఆర్‌.సి.పి కార్యాలయంలో జరిగిన ఒక కార్యక్రమంలో ఎం.పీ.పీ అనగాని రవి, జెడ్‌.పి.టి.సి అన్నవరపు ఎలిజబెత్‌ రాణి, పడమట సురేష్‌, కైలే శివకుమార్‌, మేచినేని బాబు, చిమటా శ్రీనివాసరావు, జలసూత్రం రామ్మోహన్‌, వింతా శంకరరెడ్డి, లుక్కా ప్రసాద్‌, మెండెం రాంబాబు, పాగొలు సురేష్‌ తదితర ప్రజాప్రతినిధులు మరియు పార్టీ నాయకులు నాగరాజుకు అందజేశారు.