Sep 10,2023 21:48

లాంగ్‌జంప్‌లో పాల్గొన్న నాగేంద్రరావునాయుడు

మక్కువ: ఆచార్య నాగార్జున యూనివర్సిటీ గుంటూరులో శుక్రవారం జరిగిన రాష్ట్ర స్థాయి స్పోర్ట్స్‌ మీట్‌లో గరుగుబిల్లి మండలం నాగూరు జెడ్‌పిహెచ్‌ స్కూల్లో పిటిగా పనిచేస్తున్న మక్కువ మండలం వెంకట బైరిపురానికి చెందిన గేదెల నాగేంద్రరావు నాయుడు లాంగ్‌ జంప్‌ విభాగంలో (3.56 మీటర్స్‌) స్టేట్‌ మీట్‌ లో జాతీయస్థాయికి అర్హత సాధించారు. త్వరలో చత్తీష్‌ఘడ్‌లో జరగబోయే జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొననున్నారు. ఈ మేరకు ఆయన్ను పాఠశాల హెచ్‌ఎం ఈ.రాజేశ్వర రావు, స్టాప్‌ సెక్రెటరీ బి.చంద్రమౌళి, తోటి ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రామస్తులు అభినందనలు తెలిపారు. అలాగే వ్యాయామ ఉపాధ్యాయ సంఘం అధ్యక్షులు మజ్జి. రామకృష్ణ, సెక్రెటరీ ఎం.మురళి, ఎస్‌జిఎఫ్‌ అధ్యక్షులు డిటి గాంధీ, జిల్లా క్రీడల సమన్వయకర్త మంతెన వాసుదేవరావు నాయుడు, పిఇటిలు, పీడీ అభినందించారు.