Sep 21,2023 21:31

పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్న యుటిఎఫ్‌ నాయకులు

ప్రజాశక్తి - వీరఘట్టం : యుటిఎఫ్‌ స్వర్ణోత్సవ సంబరాల్లో భాగంగా ఈనెల 22వ తేదీన సీతంపేటలో జరిగే జాతను జయప్రదం చేయాలని యుటిఎఫ్‌ జిల్లా అధ్యక్షులు టి.రమేష్‌ ఉపాధ్యాయులకు పిలుపునిచ్చారు. గురువారం మండలంలోని నడిమికెల్లా, కంబర్వలస, వీర ఘట్టం బాలుర, బాలికల, నర్సిపురం కత్తుల కవిటి నర్సిపురం గోర పాఠశాలల సందర్శించి యుటిఎఫ్‌ స్వర్ణోత్సవ పోస్టర్ను ఆవిష్కరించారు. అక్టోబర్‌ ఒకటో తేదీన విజయవాడలో జరిగే స్వర్ణోత్సవ వేడుకల్లో ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి ఎం పైడిరాజు, మండల అధ్యక్షులు బి దుర్గాప్రసాద్‌, మండల ప్రధాన కార్యదర్శి గోవిందరావు, ఏ స్వామి బాబు, ఎస్‌ సతీష్‌ తదితర ఉపాధ్యాయులు పాల్గొన్నారు.