Aug 22,2023 22:58

ప్రజాశక్తి - మచిలీపట్నం అర్బన్‌ : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర నైపుణ్యాభివద్ధి సంస్థ (ఏ పి ఎస్‌ ఎస్‌ డి సి) అధ్వర్యంలో జిల్లాలోని నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు మంగళవారం ఉయ్యూరులోని ఏపి అండ్‌ ఎస్జి సిద్ధార్థ డిగ్రీ కాలేజ్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాలలో మినీ జాబ్‌ మేళా నిర్వహించారు. ఈ సందర్బంగా జిల్లా నైపుణ్యాభివద్ధి అధికారి యస్‌ శ్రీనివాసరావు మాట్లాడుతూ మినీ జాబ్‌ మేళాలో హెటురో లాబ్స్‌, ముత్తూత్‌ ఫైనాన్స్‌, యాక్సిస్‌ బ్యాంకుల ప్రతినిధులు పాల్గొన్నారన్నారు. మొత్తం 79 మంది అభ్యర్థులు ఇంటర్వ్యూలకు హాజరు కాగా 15 మంది అభ్యర్థులు ఉద్యోగాలకు ఎంపిక అయ్యారని, 23 మంది తదుపరి ఇంటర్వ్యూలకు ఎంపికయ్యారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్‌ వి. శ్రీరామ్‌, సంస్థ జిల్లా నియామక కార్యనిర్వాహకులు తుర్లపాటి మధు, కళాశాల ట్రైనింగ్‌ అండ్‌ ప్లేస్మెంట్‌ సెల్‌ ఆఫీసర్‌ నాగ ప్రసాద్‌, స్కిల్‌ కాలేజ్‌ కోఆర్డినేటర్‌ చంద్రశేఖర్‌, స్కిల్‌ హబ్‌ కోఆర్డినేటర్‌ సోమ శంకర్‌, కంపెనీల ప్రతినిధులు, కళాశాల అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు.