Sep 15,2023 21:34

మేళాలో మాట్లాడుతున్న కంపెనీ ప్రతినిధి

కలెక్టరేట్‌: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు ఉద్యోగ కల్పనలో భాగంగా పార్వతీపురం అసెంబ్లీ నియోజకవర్గం సంబంధించి స్థానిక ప్రభుత్వ జూనియర్‌, డిగ్రీ కాలేజీ ఆవరణంలో మినీ జాబ్‌ మేళా నిర్వహించారు. ఈ మేళాకు పలు కంపెనీల ప్రతినిధులు హాజరయ్యారు. శుక్రవారం జరిగిన జాబ్‌మేళాకు సుమారు 57 మంది ఇంటర్వ్యూలకు హాజరుకాగా, అందులో 28 మంది ఎంపికైనట్టు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి యు. సాయికుమార్‌ తెలిపారు. ఈ సందర్భంగా ప్రభుత్వ జూనియర్‌, డిగ్రీ కాలేజీ ప్రిన్సిపల్‌ జె.రామారావు మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమం నిర్వహించడం ఇది రెండోసారని, ఎపి రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ సహకారంతో మరిన్ని నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నామని అన్నారు. జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి సాయికుమార్‌ మాట్లాడుతూ ఇలాంటి అవకాశాలను నిరుద్యోగ యువత అందిపుచ్చుకుని ఉన్నతా శిఖరాలు అధిరోహించాల న్నారు. కార్యక్రమంలో కాలేజీ సిబ్బంది పాల్గొన్నారు.