ప్రజాశక్తి-కలక్టరేట్ (కృష్ణా) : పీరియాడికల్ తనిఖీల్లో భాగంగా మంగళవారం జిల్లా కలెక్టర్ పి రాజాబాబు నగరంలోని కలెక్టరేట్ ప్రాంగణంలో గల ఈవీఎం గోడౌన్ సీలు తెరిపించి అందులో భద్రపరిచిన ఉమ్మడి కష్ణ జిల్లా ఈవీఎంలను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను పక్కాగా భద్రపరచాలన్నారు. సిసి కెమెరాలు, ఫైర్ టెండర్లు సక్రమంగా పనిచేస్తున్నాయా లేదా విచారించారు. సంబంధిత రిజిస్టర్లను తనిఖీ చేసి సరిగా వున్నాయా లేదా పరిశీలించారు. ఈ తనిఖీలో జిల్లా కలెక్టర్ వెంట డిఆర్‌ఓ ఎం. వెంకటేశ్వర్లు, కోఆర్డినేషన్ తాసిల్దార్ హరినాథ్, డిప్యూటీ తాసిల్దార్ శ్యామ్ తదితరులు ఉన్నారు.










