Aug 28,2023 21:47

పాచిపెంట.. వట్టిగడ్డ ఇసుక రీచ్‌ వద్ద సత్యాగ్రహ నిరసన చేపడుతున్న టిడిపి నాయకులు

ప్రజాశక్తి-పాచిపెంట : నిబంధనలకు విరుద్ధంగా రాష్ట్రంలో ఇసుక మాఫియాను వైసిపి ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యులు గుమ్మడి సంధ్యారాణి ఆరోపించారు. సోమవారం మండలంలో పాంచాలి గ్రామంలో వట్టిగడ్డ ఇసుక రీచ్‌ వద్ద టిడిపి నాయకులు సత్యాగ్రహ నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ టిడిపి హయాంలో ప్రజలకు ఉచితంగా ఇసుక అందుబాటులో ఉండేదన్నారు. ప్రస్తుత వైసిపి ప్రభుత్వంలో దాచుకోవడం, దోచుకోవడం అలవాటైందన్నారు. ఇసుక మాఫియా అక్రమాలకు అడ్డుకట్ట వేసి, భూగర్భ జలాలను పరిరక్షించుకోవలసిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆర్‌.పి భంజ్‌దేవ్‌, మండల అధ్యక్షుడు పిన్నింటి ప్రసాద్‌బాబు, వేణు, నిమ్మాది చిట్టి, సర్పంచ్‌ గూడెపు యుగంధర్‌, ముఖి సూర్యనారాయణ పాల్గొన్నారు.
ఇసుక అక్రమ రవాణాను అరికట్టాలి
సీతానగరం : ఇసుక అక్రమ రవాణాను అరికట్టాలని టిడిపి రాష్ట్ర కార్యదర్శి ద్వారపురెడ్డి జగదీష్‌ అధికారులను డిమాండ్‌ చేశారు. సోమవారం సీతానగరంలో టిడిపి ఆధ్వర్యాన నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసిపి ప్రభుత్వం ఇసుక దందా చేసి కాంట్రాక్టర్లను పెంచి పోషిస్తోందన్నారు. వైసిపి అధికారంలోకి వచ్చాక ఉచితమనే పదం లేకుండా పోయిందన్నారు. సామాన్యుడు ఇల్లు నిర్మించుకోవాలంటే ఇసుక దొరికే పరిస్థితి లేదని తెలిపారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే బి.చిరంజీవులు, టిడిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జి బి.విజయచంద్ర, మండల అధ్యక్ష, కార్యదర్శులు కొల్లు తిరుపతిరావు, వేణుగోపాల్‌ నాయుడు, మండల నాయకులు బి.శ్రీనివాసరావు, ఎస్‌.శ్రీనివాసరావు, ఎస్‌.కొండలరావు, హరి, గోపాలరావు, సర్పంచ్‌ జె.తెరీజమ్మ, తదితరులు పాల్గొన్నారు