Sep 01,2023 21:38

ఆల్‌దిబెస్ట్‌నమూనాలో కూర్చున్న శ్రీ భారతి ఇంగ్లీష్‌ మీడియం స్కూల్‌ విద్యార్థులు

ప్రజాశక్తి - బలిజిపేట :  ఇస్రో శనివారం చేపట్టనున్న ఆదిత్య-ఎల్‌1 ప్రయోగానికి మండలంలోని శ్రీ భారతి ఇంగ్లీష్‌ మీడియం స్కూల్‌ విద్యార్థులు శుక్రవారం ఆల్‌ ద బెస్ట్‌ చెప్పే నమూనా ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఆ పాఠశాల ప్రధా నోపాధ్యాయులు బి.జగన్‌ మాట్లాడుతూ 2008లో చంద్రయాన్‌-1 నుంచి 15ఏళ్ల కఠోర దీక్ష చేసి, చంద్రయాన్‌-3 ద్వారా ఘనత సాధించి దేశానికి మంచి పేరు వచ్చిందన్నారు. అయితే అదే క్రమంలో ఆదిత్య ఎల్‌ -1 విజయవంతం కావాలని, ఈ విధంగా నమూనా వేయడం జరిగిందని అన్నారు. కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది స్వప్న, వెంకట్‌, లక్ష్మణ, శ్రీను, సిబ్బంది పాల్గొన్నారు.