20 మందికి గాయాలు
ప్రజాశక్తి ఆదోని : కర్నూలు జిల్లా ఆదోని మండలం అలసంద గుత్తి గ్రామంలో ఆదివారం రాత్రి వైసిపి టిడిపి చెందిన వారి మధ్య ఘర్షణ జరిగింది. రస్తా విషయంలో మాట మాట పెరిగి ఒకరిపై ఒకరు రాళ్లు కర్రలతో దాడులకు పాల్పడడంతో సుమారు 20 మందికి గాయాలైనట్లు గ్రామస్తులు తెలిపారు. పక్కాప్లాన్ తోనే టిడిపి కార్యకర్తలపై అధికార పార్టీ నాయకులు దాడికి పాల్పడ్డారని టిడిపి సీనియర్ నాయకుడు ఉమాపతి నాయుడు తెలిపారు. గాయాలతో ప్రభుత్వ ఆసుపత్రిలో చేరిన క్షతగాత్రులను పరామర్శించి పరిస్థితిని తెలుసుకున్నామన్నారు. నిష్పక్షపాతంగా వ్యవహరించి గాయాల పాలైన వారికి న్యాయం చేయాలన్నారు. ప్రశాంతంగా ఉన్న ప్రాంతాలలో చిచ్చు రేపడం తగదని వైసిపి నాయకులకు హితువు పలికారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.










