ఐఫోన్ యాజర్లకు ఐవోఎస్ 15 అప్‌డేట్ అందుబాటులో ఉంది. కానీ అప్‌డేట్ చేస్తుంటే ‘ఫోన్ మొమరీ ఫుల్’ అని పాప్ అప్ వస్తుంది. దీంతో యూజర్లు కంపెనీకి ఫిర్యాదులు పంపారు. దీనికి ఏం కంగారు పడనవసరం లేదని యాపిల్ చెబుతుంది. దీనికి పరిష్కారం మీ ఫోన్ ని రీస్టార్ట్ చేయడమని సూచించింది. అయితే ఇలా చేసిన కొందరికి ఆ సమస్య అలానే ఉంది. కొందరికి ఉన్న స్టోరేజ్ కంటే ఎక్కువ స్టోరేజ్ చూపిస్తుందని మరలా ఫిర్యాదులు చేస్తున్నారు. ఫిర్యాదులకు సమాధానాలు చెబుతున్న యాపిల్ ఈ సమస్య ఏమిటన్నది తెలుపడం లేదు.










