యాపిల్ ప్రేమికులు చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నా ఐఫోన్ 13ను యాపిల్ సంస్థ ఈరోజు విడుదల చేయనుంది. దీని కోసం కాలిఫోర్నియా స్ట్రీమింగ్ అనే ఈవెంట్‌ను నిర్వహిస్తోంది. భారత కాలమానం ప్రకారం మంగళవారం (14 సెప్టెంబర్) రాత్రి 10.30కు ఈ ఈవెంట్ ప్రారంభం అవుతుంది. ఈ ఈవెంట్లో యాపిల్ ఐఫోన్ 13 సిరీస్‌తో పాటు యాపిల్ వాచ్ సిరీస్ 7ను కూడా రిలీజ్ చేస్తారని తెలుస్తోంది. ఐఫోన్ 13 సిరీస్‌లో భాగంగా ఐఫోన్ 13, ఐఫోన్ 13 మినీ మోడల్స్ ఫోన్లు 128 జీబీ, 256 జీబీ, 512 జీబీ ఇంటర్నల్ స్టోరేజీతో రానున్నాయి. ఐఫోన్ 13 ప్రో, ఐఫోన్ 13 ప్రో మ్యాక్స్ ఫోన్లు.. ఒక టీబీ స్టోరేజీ కెపాసిటీతో రానున్నాయి. ప్రో మోడల్స్ రీఫ్రెష్ రేట్ 120 హెచ్‌జెడ్‌తో రానున్నాయి. ఫ్లాట్ ఎడ్జ్, లార్జ్ స్క్రీన్, సరికొత్త చిప్‌తో యాపిల్ వాచ్ సిరీస్ 7 సరికొత్త డిజైన్‌తో రానుంది.










