- ద్రాక్షారామ విలేకరుల సమావేశంలో మాట్లాడిన దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ
- బీసీ సంక్షేమ శాఖ మంత్రి వేణుగోపాలకృష్ణ
ప్రజాశక్తి-రామచంద్రపురం : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పైరాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తరు. శనివారం ద్రాక్షారామం వచ్చిన ఆ యన స్థానిక మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణతో కలిపి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. చంద్రబాబు కోసం కిరాయికి మాట్లాడుతున్నావని, అన్నవరంలో నకిలీ పురోహితులు నీ దగ్గరకు వచ్చి చెప్తే పురోహితులను వేలం వేస్తున్నారని నోటికొచ్చినట్టు మాట్లాడటం తగదు అన్నారు. అన్నవరం అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతుందన్న విషయం తెలుసా అని ప్రశ్నించారు. లక్షలు ఖర్చు పెట్టి పెళ్లిళ్లు చేసే స్తోమత ఉన్న వారు కూడా స్వామివారి మీద భక్తితో పిల్లలకు అన్నవరంలో వివాహం చేస్తున్నారని, అన్నవరం దళారీ వ్యవస్థ నిర్మూలించేందుకు చర్యలు తీసుకున్నామని వివరించారు. అన్నవరంలో వివాహాలు జరిగే తీరును క్రమబద్ధీకరించామని వీటి కోసం ప్రత్యేక అధికారిని నియమించామని తెలియజేశారు. ఆలయంలో జరిగే పెళ్లిళ్లకు ఆలయ నిర్వాహకులు బాధ్యులు కాదని, అన్నవరంలో సరాసరి ఏడాదికి 7 లక్షలు వ్రతాలు జరుగుతాయి. 4 వేల వివాహాలు జరుగుతాయని వెల్లడించారు. బ్రోకర్ల పనులకి అడ్డుకట్ట పడిందనే వీళ్లంతా పవన్ కళ్యాణ్ సంప్రదించారన్నారు. పవన్ మాట్లాడే కంటెంట్ అంతా పచ్చ మీడియా విషం చిమ్ముతున్నదేనని అన్నారు. చంద్రబాబు చేసేది మనీలాండరింగ్ అని బాబు సింగపూర్ పార్ట్నర్ను అక్కడి ప్రభుత్వం అరెస్ట్ చేసిందని ఇవాళ చంద్రబాబు, ఈనాడు ముఖాలు ఎక్కడ పెట్టుకుంటారని ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ కి ఎప్పుడూ చంద్రబాబు ఇచ్చే ప్యాకేజీ పైనే దృష్టి ఉంటుందని ప్రజా నాయకుడైన సీఎం జగన్ విమర్శిస్తే ప్రజలే నీకు మరోసారి బుద్ధి చెప్తారన్నారు. మంత్రి వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ రోజుకో రకంగా మాట్లాడే పవన్ కళ్యాణ్ ప్రతిపాడు నుండి పశ్చిమగోదావరి జిల్లా వరకు అనేక విషయాలను గొడవలను సృష్టించారన్నారు. వాలంటీర్ల మీద లేనిపోని ఆరోపణలు చేశారని అదే విధంగా కులాల మీద వర్గాల మీద ఆరోపణలు తగదని మంత్రి వేణు హెచ్చరించారు.










