- అవినీతి అనకొండగా మంత్రి
- రాజ్యాంగేతర శక్తిగా నరేన్
- వైసిపి కార్యకర్తల ఆత్మీయ సమావేశం వక్తలు
- 3 వేలమంది హాజరు
ప్రజాశక్తి-రామచంద్రపురం : రామచంద్రపురం ఎంఎల్ఏ, రాష్ట్ర మంత్రి చెల్లుబోయిన వేణు గోపాల కృష్ణ నాయకత్వం అలనాటి బ్రిటిష్ పాలనను తలపిస్తున్నదని పలువురు వైసిపి కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసిపి కార్యకర్తలు ఆత్మీయ సమావేశం ద్రాక్షారామలోని సాయి మాధవానంద ఫంక్షన్ హాల్ లో ఆదివారం నిర్వహించారు.సమావేశంలో మాజీ జడ్పీటిసి ఇంత సంతోషం, వైసిపి కార్య కర్తలు దొంగ శ్రీధర్, పొలినాటి ప్రసాద్,శ్యామ్ ప్రసాద్, మల్లేశ్వర రావు,పలు గ్రామాల నాయకులు ప్రసంగించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత నాలుగేళ్లుగా కార్యకర్తలను పట్టించు కోవడం లేదని, బోస్ అనుచరునిగా వచ్చి బోస్ వర్గాన్ని అణగ తొక్కారని, తనకు ఒక వర్గం ఏర్పాటుకు కార్య కర్థలను వేధింపులకు గురి చేశారని, అనేక తప్పుడు కేసులు బనాయించారని ఆవేదన వ్యక్తం చేశారు. అదే విధంగా ప్రతి పనికి లంచం తీసుకుంటూ అవినీతి అనకొండగా మారారని ఆరోపించారు. దీనితో పాటుగా ఎన్నికలో గెలిచిన తరువాత ఒక్క గ్రామంలోను కృతజ్ఞత పర్యటన చేయలేదనీ, పదవి మంత్రి ది ఐనా పెత్తనం తనయుడు నరేన్ ది అని అతడు రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. రామచంద్రపురంలో రూ 5 కోట్ల భవనం అవినీతి సొమ్మని ఆరోపించారు. 2024 ఎన్నికలలో వేణుకు సిటిస్తే ఒడిస్తామని హెచ్చరించారు. కార్యకర్తలకు ఏ ఆపద వచ్చినా పట్టించుకునే నాథుడే లేడ నీ వారు ఆవేదన వ్యక్తం చేశారు.మంత్రి వేణును ఒడిస్తామని తెలియచేశారు. వచ్చే ఎన్నికల్లో బోస్ తనయుడు సూర్య ప్రకాష్ కు వైసిపి టికెట్ కేటాయించాలని సభలో తీర్మానించారు. కే.గంగవరం, రామచంద్రపురం, కాజులూరు మండలాల నుండి కార్యకర్తలు సుమారు మూడు వేలమంది హాజరయ్యారు.










