ప్రజాశక్తి-ఆత్రేయపురం
రైతులు యాజమాన్య పద్ధతులు అవలంబించడం ద్వారా మేలైన దిగుబడులు సాధించవచ్చునని జిల్లా వ్యవసాయ అధికారి వి.బోసుబాబు అన్నారు. గురువారం మం డలంలోని రాజవరం గ్రామంలో డాక్టర్ వైఎస్‌ఆర్ పొలంబడి కార్యక్రమం నిర్వహిం చారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి వి.బోసుబాబు మాట్లాడుతూ రైతులకి వరి లో మేలైన వ్యవసాయ పద్ధతులు మరియు సస్యరక్షణ చర్యలు గురించి వివరించారు. పురుగుల మందులు వాడకం తగ్గించాలని, శత్రు పురుగులు, మిత్ర పురుగులు గురించి రైతులకి అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి జెవి.పట్టాభి రామయ్య మాట్లాడుతూ వరి పంట యాజమాన్య పద్ధతులు వివరించారు. ఈ కార్యక్రమం లో జిల్లా వనరుల కేంద్రం వ్యవసాయ అధికారి జె. మనోహర్, అగ్రికల్చర్ అసిస్టెంట్లు, రైతులు పాల్గున్నారు.










