Sep 08,2023 20:48

ప్రజాశక్తి-ఉప్పలగుప్తం
సాగులో వ్యవసాయ అధికారుల సూచనలు సలహాలు పాటించి సాగు చేస్తే అధిక దిగుబడులు పొందవచ్చని వ్యవసాయ సలహా మండలి జిల్లా ఛైర్మన్‌ మోటూరి సాయి అన్నారు. ఎంపిడిఒ కార్యాలయంలో శుక్రవారం వ్యవసాయ సలహా మండలి మండల ఛైర్మన్‌ మానే శ్రీను అధ్యక్షతన రైతులతో సమావేశం నిర్వహించారు .సాగులో తీసుకోవలసిన యాజమాన్య పద్ధతులను వ్యవసాయ శాఖ ఎడిఎ, ఎంఎ షంసి వివరించారు. డ్రైన్స్‌,ఇరిగేషన్‌ తోపాటు సంబంధిత అధికారులు తరచూ వ్యవసాయ సలహా మండలి సమావేశానికి గైర్హాజరవుతున్నారని ఇకపై విధిగా వ్యవసాయ అనుబంధ శాఖ అధికారులంతా సమావేశానికి హాజరయ్యేటట్టు చూడాలని రైతులు కోరారు. సమావేశంలో రైతు నాయకులు మారిశెట్టి పుండరీకాక్షుడు,ఆకుల వెంకట సత్యనారాయణ, రుద్రరాజు వెంకట సత్యనారాయణ రాజు,మండల వ్యవసాయ అధికారి జి.కుమార్‌ బాబు,ఏరువాక సైంటిస్ట్‌ ప్రదీప్‌,హెచ్‌ఒ,కె.చందన తదితరులు పాల్గొన్నారు.