Aug 07,2023 00:05

ప్రజాశక్తి-రాజోలు
రాజోలు, సఖినేటిపల్లి, మలికిపురం మండలాల్లో ఎంపిక చేసిన 50 మంది వరద బాధితులకు తిరుపతి కేంద్రంగా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న పీపుల్స్‌ ఛారిటీ ట్రస్ట్‌ మేనేజింగ్‌ ట్రస్టీ మనోహర్‌ ఆదివారం ఒక్కొక్కరికి రూ.2వేలు విలువైన బియ్యం, పప్పులు, మిర్చి, చింతపండు, ఆయిల్‌ పేకట్స్‌ లాంటి 17 రకాల నిత్యావసర వస్తువులు సహాయంగా అందించారు. ఈ కార్యక్రమానికి సహకరించిన దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ పంపిణీ కార్యక్రమాలలో సఖినేటిపల్లి తహశీల్దార్‌ రామకుమారి పర్యవేక్షణలో ఆయా ప్రాంతాల విఆర్‌ఒలు, వాలంటీర్లు సహకరించారు. సేవా కార్యకర్తలు వాకా రాంబాబు, గిడుగు తాతాలు, ఆకుల వెంకటేష్‌, కుంపట్ల ముని తదితరులు పాల్గొన్నారు.. ఈ కార్యక్రమాన్ని మానవతామూర్తులు గ్రూప్‌ అడ్మిన్‌ బోనం రాజు సమన్వయ పరిచారు..