Aug 04,2023 00:12

ప్రజాశక్తి-యంత్రాంగం
గోదావరి వరద పూర్తిగా తగ్గు ముఖం పట్టడంలో లంక గ్రామాలు తేరుకున్నాయి. ప్రభుత్వం వరద బాధితులకు బియ్యం, నిత్యావసరాలు, కూరగాయలను అందజేస్తోంది. పలుగ్రామాల్లో గురువారం వరద బాధితులకు బియ్యం, నిత్యావసరాలను ప్రజాప్రతినిధులు పంపిణీచేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వరద బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు.
ఐ.పోలవరం : వరద ప్రభావిత ప్రాంతాలైన గోగుల్లంక గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న వరద బాధితులకు ఒక్కొ కార్డు దారునికి 25కేజీల చొప్పున బియ్యం, కిలో కందిపప్పు, కిలో పామాయిల్‌, కిలో ఉల్లిపాయలు, కిలో బంగాళాదుంపలను ముమ్మిడివరం ఎంఎల్‌ఎ పొన్నాడ వెంకట సతీష్‌ కుమార్‌ పంపిణీచేశారు. కార్యక్రమంలో ఎంపిపి మోర్త రాణి మిరియం జ్యోతి, జెడ్‌పిటిసి సభ్యులు ముదునూరి సతీష్‌ రాజు తదితరులు పాల్గొన్నారు.
కొత్తపేట : మండల పరిధిలో గల నారాయణలంక, సత్తెమ్మ లంక వరద బాధితులకు ప్రభుత్వ విప్‌, ఎంఎల్‌ఎ చిర్ల జగ్గిరెడ్డి 25 కిలోల బియ్యం, నిత్యావసరాలు అందజేశారు. కార్యక్రమంలో ఎంపిపి మార్గన గంగాధర్‌, ఆముడ చైర్మన్‌ గొల్లపల్లి డేవిడ్‌ రాజు, జెడ్‌పిటిసి సభ్యురాలు గూడపాటి రమాదేవి తదితరులు పాల్గొన్నారు.
కపిలేశ్వరపురం : మండలంలోని లంక గ్రామాలైన కేదార్లంక, వీధివారిలంక, నారాయణలంక , అద్దంకివారిలంక, పల్లపలంక గ్రామాల్లో గురువారం ఎంఎల్‌సి తోట త్రిమూర్తులు వరద బాధితులకు నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరద బాధితులను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందన్నారు. కార్యక్రమాల్లో ఎంపిపి మేడిశెట్టి సత్యవేణి దుర్గారావు, జెడ్‌పిటిసి సభ్యుడు పుట్టపూడి వీర వెంకట సూర్యనారాయణ, సర్పంచులు వీధి వెంకటరెడ్డి, నాతి గవరయ్య, ఆర్‌డిఒ సింధు, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
దాణా పంపిణీ
కొత్తపేట : కొత్తపేట మండల పరిధిలోని వాడపాలెం గ్రామంలో వరద ముంపు పాడిరైతులకు గురువారం ఉచితసమీకతదాన పంపిణీ చేశారు. కార్యక్రమంలో వ్యవసాయ సలహా మండలి ఛైర్మన్‌ పెదపూడి శ్రీనివాస్‌, గ్రామ పార్టీ అధ్యక్షులు మట్ట బాబ్జి తదితరులు పాల్గొన్నారు.
పారిశుధ్య పనులను పరిశీలన
ఆత్రేయపురం : మండలంలోని బొబ్బర్లంక గ్రామ పిచ్చుకలంక గ్రామంలో జరుగుతున్న పారిశుధ్య పనులను ఎంపిడఒ నాతి బుజ్జి గురువారం పరిశీలించారు. వరద ఉదతి తగ్గి, ఇళ్లు మరియు పరిసరాలలో బురద చేరినందున సర్పంచి నరాలశెట్టి సుబ్బలక్ష్మి, కార్యదర్శి హనుమ ఆధ్వర్యంలో పారిశుధ్య పనులు చేపట్టారు. ఆమె మాట్లాడుతూ. అంటురోగాలు ప్రబలకుండా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని తెలిపారు. అక్కడ నివసిస్తున్న ప్రజలు విద్యుత్‌ సౌకర్యం లేక ఇబ్బంది పడుతున్నామని, సోలార్‌ ద్వారా అయినా విద్యుత్‌ సౌకర్యం కల్పించాలని ఎంపిడిఒకు విన్నవించారు. స్థానిక ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారుల దష్టికి తీసుకు వెళ్ళి సమస్య పరిష్కారానికి కషి చేస్తానని ఆమె అన్నారు.