ప్రజాశక్తి - అయినవిల్లి
హైదరాబాద్‌లో జరిగే మాదిగల విశ్వరూప మహాసభను జయప్రదం చేయాలని మహాజన సోషలిస్లు పార్టీ ఇన్‌ఛార్జి నేదునూరి వెంకట్రావు పిలుపునిచ్చారు. అయినవిల్లి మండలం లోని తోత్తరమూడి గ్రామంలో 'హలో మాదిగ చలో హైదరాబాద్' పేర ముద్రించిన మాదిగల విశ్వరూప మహాసభ పోస్టర్‌ను గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వెంకట్రావు మాట్లాడారు. షెడ్యూల్ కులాల వర్గీకరణ బిల్లును బిజెపి ప్రభుత్వం ఈ పార్లమెంటు సమావేశంలో ప్రవేశపెట్టి చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ డిమాండ్‌తో మందకష్ణ మాదిగ నాయకత్వంలో. మాదిగల విశ్వరూప మహాసభను నిర్వహిస్తున్నారని తెలిపారు. ఆగస్టు రెండో వారంలో జరగబోయే భారీ బహిరంగ సభను మాదిగలు కుటుంబ సమేతంగా మహాసభలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గం కో-ఇన్‌ఛార్జి రవీంద్రబాబు, అయినవిల్లి మండలం మహాజన సోషలిస్టు పార్టీ ప్రెసిడెంట్ కోళ్లు శ్రీను, నేదునూరి శ్రీను, పెదపూడి బుల్లి, నేదునూరి గాంధీ, తదితరులు పాల్గొన్నారు.










