కార్మికుని కుటుంబాన్ని ఆదుకోవాలి డిమాండ్
ప్రజాశక్తి-కాట్రేనికోన
పల్లంకుర్రు పంచాయతీ పరిధిలోని జైభీమ్ నగర్ కాలనీలో బుధవారం కార్మికుడు నల్లం రామకృష్ణ(38) భవననిర్మాణ పనులు చేస్తుండగా విద్యుత్ షాక్ కారణంగా అకాలమరణం పొందాడు. స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం మృతుడు నల్లం రామకృష్ణ జీవనోపాధి నిమిత్తం తాపీపని చేసుకుంటూ కందికుప్ప గ్రామంలో భార్య, ఇద్దరు పిల్లలతో నివాసం ఉంటున్నాడు. బుధవారం రోజు వారి పనుల నిమిత్తం పల్లంకుర్రు జైభీమ్ నగర్ కాలనీలో ఒక ఇంటివద్ద తాపీ పని చేస్తుండగా ఇంటికి అమర్చిన విద్యుత్ వైర్లు తగిలి మరణించినట్టు తెలిపారు.
రూ.10లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలి
విద్యుత్ ప్రమాదంలో చనిపోయిన భవన నిర్మాణ కార్మిక కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని యూనియన్ అధ్యక్షులు గాంజా సత్తిబాబు, కార్యదర్శి విపర్తి మోహన్‌రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాట్రేనికోన మండలం పల్లంకురు గ్రామపంచాయతీ పెదపేట, జైబీమ్ నగర్ లో బడుగు శ్రీనివాస్ ఇల్లు నిర్మాణం చేస్తుండగా విద్యుత్ షాక్ గురై కార్మికుడు నల్లం రామకృష్ణ అక్కడికక్కడే చనిపోయాడు. రామకృష్ణ కుటుంబం రోడ్డును పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇల్లు నిర్మించుకునే యాజమాన్యం జాగ్ర త్తలు తీసుకొని ఉంటే ఈ ప్రమాదం జరిగి ఉండేది కాదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇల్లు నిర్మాణ సమయంలో దగ్గరలో ఉన్న తీగలకు ప్లాస్టిక్ పైప్స్ వేసి ఉండాలని అందుకు అనుగుణంగా జాగ్రత్తలు తీసు కుని ఉంటే ఈ సంఘటన జరిగేది కాద న్నారు. రామకృష్ణ కుటుంబాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆదు కోవాలని, రూ.10 లక్షలు ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని, ఆ కుటుంబంలో ఉద్యోగం ఇవ్వా లని డిమాండ్ చేశారు. రామకృష్ణ మృతదేహం వద్ద కార్మికులు నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో వాకపల్లి వెంకటేశ్వరరావు, నందీశ్వరరావు, నాగేశ్వరరావు, దుర్గాప్రసాద్, సత్యనా రాయణ, రెడ్డి కృష్ణ, తదితరులు ఉన్నారు.










