Sep 15,2023 23:14

ప్రజాశక్తి-మండపేట
విద్యార్థులు లక్ష్యాన్ని నిర్ధేశించుకుని, ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఎంఎల్‌సి తోట త్రిమూర్తులు అన్నారు. శుక్రవారం ఏడిద జెడ్‌పి ఉన్నత పాఠశాల్లో విద్యార్థుల సౌకర్యార్థం పారిశ్రామికవేత్త, విద్యాదాత నామాల పురుషోత్తం రూ.20 లక్షలతో నిర్మించిన కళావేదిక, రథం వీధిలో ఆయన తల్లిదండ్రులు నామాల వీర్రాజు సీతారత్నం పేరున రూ.55 లక్షలతో నిర్మించిన లైబ్రరీని ఎంఎల్‌సి తోట, జెడ్‌పి ఛైర్మన్‌ విప్పర్తి వేణుగోపాల్‌రావు, గ్రామ సర్పంచ్‌ బూరిగ ఆశీర్వాదం, ఎంపిపి ఉండమట్ల వాసు, విద్యా దాత నామాల పురుషోత్తమరావు, జెడ్‌పిటిసి సభ్యుడు కురుపూడి భవాని, జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్‌ దూలం పద్మ వెంకన్నబాబు, వైస్‌ ఎంపిపి పసుమర్తి నాగేశ్వరరావులు ప్రారంభించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ దాత ఇప్పటికే రూ.1.80 కోట్లతో స్కూల్‌ భవనం నిర్మించారని ఈ నేపథ్యంలో ప్రభుత్వం జూనియర్‌ కళాశాల మంజూరు చేసిందన్నారు. అనంతరం విద్యాదాతను సత్కరించారు. కార్యక్రమంలో సొసైటీ ఛైర్మన్‌ రామిశెట్టి శ్రీహరి, బలుసు అబ్బు, ఎంఇఒ నాయుడు రామచంద్రరావు, తహశీల్దార్‌ టిఆర్‌.రాజేశ్వరరావు, మండల అభివృద్ధి అధికారి ఐదం రాజు, వార్డ్‌ మెంబర్‌ చిలుకూరు బుజ్జి, వైసిపి జిల్లా ప్రధాన కార్యదర్శి వల్లూరి రామకృష్ణ, గ్రామ పార్టీ అధ్యక్షులు పలివెల సుధాకర్‌, తాతపూడి రాజేష్‌ ఉష, పాఠశాల హెచ్‌ఎం ముంగర వెంకటరాజు, తదితరులు పాల్గొన్నారు.