Aug 19,2023 23:51

ప్రజాశక్తి-మండపేట
విద్యార్థులు లక్ష్యాన్ని నిర్ధేశించుకుని ఉన్నత శిఖరాలను చేరుకోవాలని డిఇఒ కమల కుమారి అన్నారు. మండలంలోని ఏడిద జిల్లా ప్రజా పరిషత్‌ ఉన్నత పాఠశాలను డిఇఒ కమల కుమారి శనివారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మధ్యాహ్న భోజనం, సిలబస్‌ పూర్తి చేయడం తదితరాలను పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ పదవ తరగతి విద్యార్థులు లక్ష్యాన్ని దష్టిలో పెట్టుకుని చదువు కోవాలన్నారు. 3,4,5 తరగతుల విద్యార్థులందరికీ చదవడం రాయడం చతుర్విద పక్రియలపై దృష్టి సారించేలా శిక్షణ ఇవ్వాలని ఉపాధ్యాయులకు సూచించారు. ఈమె వెంట మండల విద్యాశాఖ అధికారులు నాయుడు రామచంద్రరావు, ఎం.సోమిరెడ్డి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు ముంగర వెంకట్రాజు ఉన్నారు.
శాస్త్రీయ అభివృద్ధి మానసిక
వికాసానికి నాంది కావాలి
శాస్త్రీయ అభివృద్ధి మానసిక వికాసానికి నాంది కావాలని జిల్లా విద్యాశాఖ అధికారి ఎం కమల కుమారి అన్నారు. శనివారం స్థానిక శ్రీ గౌతమి మున్సిపల్‌ ఉన్నత పాఠశాల నందు ఎపి రాష్ట్ర శాస్త్ర సాంకేతిక మండలి, జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో హీరోషిమా నాగ సాకి డే బహుమతి ప్రధానోత్సవ సభ పాఠశాల ప్రధానోపాధ్యాయులు శోభావళి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా విజేతలకు కమల కుమారి బహుమతులు ప్రధానం చేశారు. కార్యక్రమంలో జిల్లా సైన్స్‌ అధికారి గిరజాల విఎస్‌ సుబ్రహ్మణ్యం, జిల్లా ఇంక్లూజు ఎడ్యుకేషన్‌ ఆఫీసర్‌, అసిస్టెంట్‌ మానట రింగ్‌ ఆఫీసర్‌ సత్యనారాయణ, రాంబాబు, జిల్లా ఎకడమిక్‌ కోఆర్డినేటర్‌ బ్రహ్మానందం, మండల విద్యాశాఖ అధికారులు నాయుడు రామచందర్రావు, సోమిరెడ్డి, రాష్ట్ర శాస్త్ర సాంకేతిక మండలి జిల్లా రిసోర్స్‌ పర్సన్‌ మేక రామలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.