ప్రజాశకి-కపిలేశ్వరపురం
కపిలేశ్వరపురం మండలం అంగర జెడ్‌ఫి ఉన్నత పాఠశాల విద్యార్థులకు 100 మందికి మంగళవారం ఆర్‌టిసి ఉచిత బస్సు పాసులు అందజేశారు . ఈ సందర్భంగా పాఠశాల లో నిర్వహించిన సమావేశంలో గ్రామ సర్పంచ్ వాసా కోటేశ్వరరావు మాట్లాడుతూ విద్యార్థులను ప్రోత్సహించేదుకు దూర ప్రాంతాల నుంచి పాఠశాలకు వచ్చే వారికోసం ఉచితంగా తన వంతు సాయంగా 60 మందికి ఉచిత బస్సు పాస్‌లు అందజేసినట్లు తెలిపారు. అలాగే గ్రామానికి చెందిన అంగర రామ నరసింహారావు తన భార్య జ్ఞాపకార్థం 40 బస్సు పాస్‌లను, పాఠశాలలో హిందీ ఉపాధ్యాయుడు వేద రాజు లక్ష్మణ రాజు తన తండ్రి జ్ఞాపకార్థం 11 మంది వికలాంగ విద్యార్థులకు మూడు సంవత్సరాల కాల పరిమితికి ఉచిత ఆర్‌టిసి బస్సు పాసులను అందజేశారు. కార్యక్రమంలో ఎంపిటిసి సభ్యులు మేడిశెట్టి దుర్గారావు, గ్రామ పెద్దలు మేక వీరభద్రరావు, అడబాల శ్రీనివాస్ పసలపూడి శ్రీనివాస్, జె కాశి ,ఆరి చిన్నయ్య ,ఆర్టీసీ సిబ్బంది టి సూరిబాబు, జీడివిపి కుమార్, పాఠశాల హెచ్‌ఎం రాజు ,ఉపాధ్యాయ సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
అంగరలో విద్యార్థులకు ఉచిత బస్సు పాసులను అందిస్తున్న సర్పంచ్ తదితరులు










