Sep 06,2023 00:19


ప్రజాశక్తి-అమలాపురం
భారత విద్యార్థి ఫెడరేషన్‌(ఎస్‌ఎఫ్‌ఐ) డాక్టర్‌ బిఆర్‌.అంబేద్కర్‌ కోనసీమ జిల్లా కమిటీ అధ్వర్యంలో విద్యారంగ సమస్యల పరిష్కారానికై విద్యార్థి సంగ్రామ సైకిల్‌ యాత్ర రెండవ రోజు మంగళవారం అమలాపురం లో కొనసాగింది. ఈ యాత్ర లొ భాగంగా ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు పలు ప్రభుత్వ పాఠశాలలను, జూనియర్‌ కళాశాలలు సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థులకు సంబంధించి పలు సమస్యలు వెలుగు చూడటం జరిగిందనీ పలు ఓకేషనల్‌ కళాశాలలో విద్యార్థులకు సరిపడా వాష్‌ రూమ్స్‌ లేవని అలాగే లాబ్స్‌ లేవని ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే విద్యార్థులకు సరిపడా వాష్‌ రూమ్స్‌ లాబ్స్‌ ఏర్పాటు చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ డిమాండ్‌ చేశారు. అలాగే వడ్డీగుడెం బాలికల వసతి గృహంలో ఉన్న ప్రధాన సమస్య తాగునీరు, సిసి కెమెరాలు పనిచేయకపోవడం పై తక్షణమే పరిష్కరించారని హాస్టల్‌లో ప్రతి సమస్య పరిష్కరించాలని ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు కోరారు. ఈ సంగ్రామ సైకిల్‌ యాత్ర లో డాక్టర్‌ బిఆర్‌.అంబేద్కర్‌ కోనసీమ జిల్లా కన్వీనర్‌ మదన్‌ కో కన్వీనరలు ప్రణీత్‌, సాయి , శంకర్‌ కమిటీ సభ్యులు సందీప్‌ యువ, సంజన, కుసుమ శ్రీ, ప్రవీణ్‌, తేజ తదితరులు పాల్గొన్నారు.