Jul 12,2023 22:29

ప్రజాశక్తి-మామిడికుదురు
విద్యాభివృద్ధికి సేవా సంస్థలు తోడ్పాటు అందించాలని ఎంఇఒ లక్ష్మీనారాయణ అన్నారు. ఈదరాడ సిద్ధార్థ పేట ఎంపిపి ప్రాథమిక పాఠశాల్లో అంబేద్కర్‌ ఎడ్యుకేషనల్‌ అసోసియేషన్‌ గల్ఫ్‌ ఎన్‌.హరీష్‌ ఫ్రెండ్స్‌ ఆధ్వర్యంలో సమకూర్చిన పుస్తకాలు, పెన్నులు, అట్టలు, పలకలను బుధవారం ఎంఇఒ లక్ష్మీనారాయణ, సర్పంచ్‌ చుట్టుగుళ్ళ లక్ష్మి విద్యార్థులకు అందజేశారు. పేరెంట్స్‌ కమిటీ ఛైర్మన్‌ కుసుమ ప్రసాద్‌ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎంఇఒ మోకా వెంకన్నబాబు, హెచ్‌ఎం ఎస్‌.శ్రీరామ్‌, కుసుమ శ్రీధర్‌ తదితరులు పాల్గొన్నారు.