ప్రజాశక్తి-మండపేట
వెలగతోడు ప్రాధమిక వ్యవసాయ పరపతి సంఘ ఛైర్‌పర్సన్‌గా ముక్కపాటి కోటేశ్వరరావు నియమితులయ్యారు. గురువారం సొసైటీ కార్యాలయంలో నూతన త్రిసభ్య కమిటీ ప్రమాణస్వీకారోత్సోవం మార్కెట్ కమిటీ మాజీ వైస్ ఛైర్మన్ సాదే పిడుగు రాముడు అధ్యక్షతన జరిగింది. ఛైర్పర్సన్ గా కోటేశ్వరరావు, పర్సన్లుగా పిల్లిల్లి చిన్నఅప్పారావు, చిటికిన వీర్రాజులు ప్రమాణం చేశారు. వారు మాట్లాడుతూ సొసైటీ అభివృద్ధికి తమవంతు కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో పాలతోడు సర్పంచ్ పిల్లా వెంకటలక్ష్మి అరవరాజు, కోప్షన్ సభ్యులు షేక్ సుభాన్, వైసిపి నాయకులు తుమ్మా వీరబాబు, ముక్కపాటి రాజు, అన్నందేవుల నాగేశ్వరరావు, దోమల రాజేష్, పినిపే చినబాబు, సాదే సుమన్, పోలుమాటి శ్రీను, భీమన మణికంఠ, మెల్లిమి భీమరాజు, బళ్లా నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.










