ప్రజాశక్తి-రామచంద్రపురం : కే.గంగవరం మండలంలోని కుందూరు గ్రామంలో గొంతువాపు నివారణ టీకాలు వేశారు. కె.గంగవరం మండల అధ్యక్షురాలు పంపన నాగమణి సుబ్బారావు ఈ వైద్య శిబిరాన్ని ప్రారoభించారు. కొందూరు పరిసర ప్రాంత పశువులకు గొంతువాపు వ్యాధి రాకుండా టీకాలు వేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పశుసంవర్ధక శాఖ అధికారి కేవీ రామరాజు, జూనియర్ వెటర్నరీ ఆఫీసర్ శిరీష ఏ హెచ్ ఏ కుమారి కళ్యాణి ఏ హెచ్ ఏ శ్రీ శ్రీను ఏ హెచ్ ఏ శ్రీ సురేషు జిఎం శ్రీ నారాయణ జిఎం పాడి రైతులు మొదలగువారు పాల్గొన్నారు.










