Jul 09,2023 00:21

ప్రజాశక్తి-యంత్రాంగం
మాజీ సిఎం డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి జయంతిని జిల్లాలో శనివారం వైఎస్సార్‌ నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. పలువురు ప్రజాప్రతినిధులు వైఎస్‌ఆర్‌ జయంతి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ వైఎస్‌ఆర్‌ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు.
రామచంద్రపురం వైఎస్‌ఆర్‌ జయంతి పట్టణం లో రాష్ట్ర మంత్రి చెల్లుబోయిన వేణు గోపాల కృష్ణ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్‌ఆర్‌ విగ్రహానికి మంత్రివేణు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పేదల గుండె చప్పుడు వైఎస్‌ఆర్‌ అని అన్నారు. అనంతరం ఇక్కడ ఏర్పాటు చేసిన కేక్‌ కట్‌ చేశారు. కార్యక్రమంలో మార్కెట్‌ కమిటీ ఛైర్మన్‌ పండు గోవిందరాజు, వైసిపి నాయకులు పెట్టా శ్రీనివాస్‌ రావు, ఎంపిపి అంబటి భవాని, మున్సిపల్‌ ఛైర్మన్‌ గాదంసెట్టి శ్రీదేవి, జెడ్‌పిటిసి సభ్యురాలు వరలక్ష్మి, కె.గంగవరం ఎం పి పి పంపన నాగమణి తదితరులు పాల్గొన్నారు. వైఎస్‌ఆర్‌ జయంతి సందర్భంగా వెంకటాయపాలెంలో వైఎస్‌ఆర్‌ విగ్రహాని సర్పంచ్‌ యల్లమిల్లి సతీష్‌ కుమారి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ముఖ్య అతిథిగా జెడ్‌పిటిసి సభ్యుడు మేరిడి వెంకటేశ్వరరావు కేక్‌ కట్‌ చేశారు. కార్యక్రమంలో ఎపి ఐడిసి డైరెక్టర్‌ వాసంశెట్టి శ్యామ్‌, సచివాలయ కన్వీనర్‌ లు, యనమదల గోవిందరాజు, దడాల రవికుమార్‌, వైస్‌ సర్పంచ్‌ గంధం బుజ్జి, మాజీ సర్పంచ్‌ పిల్లి రాంబాబు, కాదా శ్రీను, మంద పల్లి మోషే తదితరులుపాల్గొన్నారు. మండపేట స్థానిక రాజారత్న జంక్షన్‌ లోని వైఎస్‌ఆర్‌ విగ్రహానికి మండపేట మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ పతివాడ దుర్గారాణి, వైసిపి రాష్ట్ర నాయకులు పట్టాభి రామయ్య చౌదరి, రెడ్డి రాజబాబు తదితరులు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం జెండాను ఆవిష్కరించి కేక్‌ కట్‌ చేసి కార్యకర్తలకు పంచిపెట్టారు. ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణిలు, బాలింతలు, రోగులకు పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు, టౌన్‌ కన్వీనర్‌ ముమ్మిడివరపు బాపిరాజు, వైసిపి నాయకులు ముక్కా సుబ్రహ్మణ్యం, ముక్కా దాలయ్య, మొండి మురళి తదితరులు పాల్గొన్నారు. కపిలేశ్వరపురం మండలంలో పలు గ్రామాల్లో వైఎస్‌ఆర్‌ జయంతినివైసిపి నాయకులు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమాల్లో ఎంపిపి మేడిశెట్టి సత్యవేణి, పార్టీ నాయకులు మట్టపర్తి పాలరాజు తదితరులు పాల్గొన్నారు. ఆలమూరు చెముడులంకలో సర్పంచ్‌ తమ్మన శ్రీనివాసు, ఆలమూరులో సర్పంచ్‌ ఎన్‌.లావణ్య కుమార రాజా, పెద్దపల్లలో నెక్కంటి వెంకట్రాయుడు, జొన్నాడలో ద్వారంపూడి దొరబాబు, నాండ్ర నాగమోహన్‌రెడ్డి, గుమ్మిలేరులో సర్పంచ్‌ గుణ్ణం రాంబాబు, చొప్పెల్లలో సర్పంచ్‌ దంగేటి చంద్రకళ బాపనయ్య, చింతలూరులో నామాల శ్రీనివాసు తదితరుల ఆధ్వర్యంలో వైఎస్‌ఆర్‌ విగ్రహాలకు క్షీరాభిషేకం చేసి నివాళులర్పించారు. అనంతరం చొప్పెల్ల పిహెచ్‌సిలో గర్బిణులకు పాలు, పండ్లు పంపిణీ చేశారు. అలాగే ఆయా గ్రామాల్లో వైఎస్‌ఆర్‌ జయంతికి వివిధ రకాల పండ్ల జాతి మొక్కలను నేతలు నాటారు. కార్యక్రమాల్లో పలువురు ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు పాల్గాన్నారు.అమలాపురం అమలాపురం హైస్కూల్‌ సెంటర్‌లో వైఎస్‌ఆర్‌ విగ్రహానికి రాష్ట్ర మంత్రి పినిపే విశ్వరూప్‌ పూల మాల వేసి నివాళులు అర్పించారు. ఆనంతరం మంత్రి మాట్లాడుతూ వైఎస్‌ఆర్‌ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రజల్లో చిరస్థాయిగా నిలిచిపోయాయన్నారు. కార్యక్రమంలో డాక్టర్‌ పినిపే శ్రీకాంత్‌, ఎంఎల్‌సి కుడిపూడి సూర్యనారాయణరావు, జెడ్‌పిటిసి సభ్యుడు పందిరి హరి, వైసిపి నాయకులు తదితరులు పాల్గొన్నారు. కొత్తపేట వైఎస్‌ఆర్‌ జయంతిని పార్టీ శ్రేణులు మండల పరిధిలో ఘనంగా నిర్వహించారు. స్థానిక పాత బస్టాండ్‌ సెంటర్లో మండల స్థాయి వైసిపి నాయకులు వైఎస్‌ఆర్‌ పూలమాలు వేసి నివాళులర్పించారు. కాట్రేనికోన మండల పరిధిలోని పల్లంకుర్రు, కందికుప్ప, గెద్దనపల్లి, కాట్రేనికొన, ఉప్పుడి, పెనుమళ్ళ, చెయ్యేరు అగ్రహారం, చెయ్యేర్రుతో పాటు అన్ని గ్రామాల్లో వైఎస్‌ఆర్‌ జయంతిని నిర్వహించారు. కాట్రేనికోన మెయిన్‌ రోడ్డు బ్రిడ్జి వద్ద గల వైఎస్‌ఆర్‌ విగ్రహానికి మండల వైసిపి అధ్యక్షులు నల్లా నరసింహ మూర్తి ఆధ్వర్యంలో పూలమాలలు వేసి ఘననివాళి అర్పించారు. పల్లంకుర్రు గ్రామ సర్పంచ్‌ నాతి అలివేలు సత్యనారాయణ అధర్వంలో బస్‌ స్టాండ్‌ వద్ద వైఎస్‌ఆర్‌ జయంతి నిర్వహించారు. కందికుప్ప సెంటర్‌లో సర్పంచ్‌ చల్లగళ్ల వెంకట లక్ష్మీ అప్పారావు, గ్రామ కమిటీ అధ్యక్షులు యేడిద లక్షణ రావు పర్యవేక్షణలో వైఎస్‌ఆర్‌ విగ్రహం దగ్గర కేకు కట్‌ చేశారు. కార్యక్రమలలో ముమ్మిడివరం వ్యవసాయ మార్కెట్‌ కమిటీ వైస్‌ ఛైర్మన్‌ కాశి హనుమంత రావు, ఎంఎస్‌ఎంఇ డైరెక్టర్‌ నల్లా బేబీ జానకి, మండల మహిళా అధ్యక్షురాలు మోకా చంద్ర నాగరత్నం, సొసైటీ అధ్యక్షులు జగడం బాలయోగి అక్కల శివరామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.