Jul 29,2023 23:20

ప్రజాశక్తి-ఆత్రేయపురం
వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయానికి శనివారం ఏకాదశి పర్వదినం కావడంతో యాత్రికులు అంచనా మించి యాత్రికులు రావడంతో ఆలయ పరిసరాలు కిటకిటలాడాయి. ఆర్‌ అండ్‌ బి రోడ్డు నుంచి పార్కింగ్‌ సముదాయం రెండు కిలోమీటర్లు వరకు వాహనాలు నిలిచిపోవడంతో ఆరు గంటలు సమయం పైనే యాత్రకు అవస్థలు పడ్డారు. ఆలయ అధికారులకు యాత్రికులు ఎంతమంది వస్తారని అంచనా లేకపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికైనా యాత్రికులు అనుకూలంగా సౌకర్యాలు కల్పించడంతోపాటు ట్రాఫిక్‌ ఇబ్బందులు కలగకుడా చర్యలు తీసుకోవాలని ఆయా ప్రాంతాల నుంచి వచ్చే యాత్రికులు కోరుకుంటున్నారు