Aug 28,2023 23:34

ప్రజాశక్తి-ఆత్రేయపురం
వాడపల్లిశ్రీ వేంకటేశ్వర స్వామి వార్షిక పవిత్రోత్సవాలు మూడవరోజు సోమవారం అత్యంత వైభవముగా ముగిశాయి. సంకల్పము, విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనము. మహాశాంతి హోమం, ప్రాయశ్చిత్త హోమాలు, మహా పూర్ణాహుతి, పవిత్ర విసర్జన, మహాదాశీర్వచనము, నీరా జన మంత్రపుష్పములు తదితర కార్యక్రమాలు అర్చకులు నిర్వహించారు. ఆలయ ఛైర్మన్‌ రుద్రరాజు రమేష్‌ రాజు, ఇఒ సత్యనారాయణరాజు, ధర్మకర్త మండలి సభ్యులు పవిత్రోత్సవాల్లో. పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేశారు దూర ప్రాంతాల నుండి వచ్చిన యాత్రికులు ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లను చేశారు.