Sep 07,2023 22:41

ప్రజాశక్తి-ఉప్పలగుప్తం
ఉపాధ్యాయులు సమాజాభివృద్ధిలో కీలకపాత్ర వహిస్తారని, వారు నవ సమాజ నిర్మాతలని డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ హార్టికల్చర్‌ యూనివర్సిటీ బోర్డు సభ్యుడు జిన్నూరి వెంకటేశ్వరరావు అన్నారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం అందుకున్న వాసంశెట్టి వెంకటేశ్వరరావును గురువారం నంగవరం సచివాలయంలో వెంకటేశ్వరరావు ఆధ్వర్యాన ఎంపిటిసి సభ్యురాలు వంగా గిరిజ కుమారి, మాజీ సర్పంచ్‌ శీలం సూరిబాబు, సచివాలయ సిబ్బంది, గ్రామస్తులు ఘనంగా సత్కరించారు.


.