ప్రజాశక్తి-అంబాజీపేట
వైయస్‌ఆర్ ఉద్యాన విశ్వ విద్యాల యం పరిధిలో గల ఉద్యాన పరిశోధనా స్థానం అధిపతిగా విధులు నిర్వహించిన డాక్టర్ బి.శ్రీనివాసులు శనివారం ఉద్యోగ విరమణ చేశారు. ప్రతిభా పురస్కారాలు పొంది ఫౌండేషన్ అవార్డులు అందుకున్న అధిపతి డాక్టర్ బి.శ్రీనివాసులు వాణి రమ దంపతులను, అలాగే టైం స్కేల్ వర్కర్ గా పనిచేసి ఉద్యోగ విరమణ చేసిన జి.సీతా రత్నంలను శనివారం శాస్త్రవేత్తలు పరిశోధన స్థానం ఉద్యోగులు సత్కరించారు. డాక్టర్ ఎల్.నారం నాయుడు డాక్టర్ కరుణశ్రీ, నూతన అధిపతి డాక్టర్ ఎన్.బి.వి. చలపతిరావు తదితరులు పాల్గొన్నారు.










