ప్రజాశక్తి-మండపేట : తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అరెస్టుకు నిరసనగా స్థానిక మున్సిపల్ కార్యాలయం వద్ద తెలుగు యువత, తెలుగు నాడు స్టూడెంట్స్ ఫెడరేషన్, వాణిజ్య, లీగల్, ధివ్యాంగుల, క్రిష్టియన్స్, సాంకేతిక, డాక్టర్స్, సాంస్కృతిక విభాగాల నాయకులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలను ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు, మున్సిపల్ మాజీ చైర్మన్ ప్రకాష్ లు ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. అనంతరం వివిధ వర్గాల నుండి సంతకాలు, అభిప్రాయాల సేకరణ కార్యక్రమం చేపట్టారు. ఈ నిరాహారదీక్ష చేపట్టిన నాయకులకు మండపేట పట్టణ, మండల, గ్రామాల నాయకులు అధిక సంఖ్యలో వచ్చి వారికి సంఘీభావం తెలిపారు.










